చిన్నమ్మ పోటీకి సై అంటున్న కోడలమ్మ

ఇకపై చదవండి pakkatelugu.com

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

చిన్నమ్మ పోటీకి సై అంటున్న కోడలమ్మ

Image result for shashikala chennai

రంజుగా సాగుతున్న తమళనాడు రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో అని దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం సీఎం పీఠంపై ఉన్న పన్నీరు సెల్వం పదవి ఎప్పుడు ఊడేది చెప్పలేమని అంతా చర్చించుకుంటున్నారు. ఓ వైపు అన్నాడీఎంకే చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న శశికళ ముఖ్యమంత్రి పీఠం కోసం వేగంగా పావులు కదుపుతుంటే… అన్నాడీఎంకేలో ఆమె వైరి వర్గం మాత్రం జయలలిత మేనకోడలు దీపను రంగంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే కొందరు నేతలు దీపను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ రాజకీయాల్లోకి రావాలని కోరుతుండటంతో… త్వరలోనే జయలలిత మేనకోడలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి:

Image result for shashikala chennai

ఇదిలా ఉంటే జయలలిత మరణంలో ఖాళీ అయిన చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శశికళ పోటి చేయడం ఖాయమైన నేపథ్యంలో… ఆమెకే పోటీగా దీపను బరిలోకి దింపాలని అన్నాడీఎంకేలోని అసంతృప్తులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీపను బరిలోకి దింపి శశికళను ఓడించేందుకు అవసరమైతే డీఎంకే మద్దతు కూడా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో ఆర్కే నగర్ పోటీలో చిన్నమ్మా వర్సెస్ కోడలమ్మ హోరా హోరీగా తలపడవచ్చే గుసగుసలు జోరందుకున్నాయి. అదే జరిగితే… తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్తరంగా మారడం ఖాయమని చెప్పకతప్పదు.

Swipe << Left | Right >> for More

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...