అమెరికాలో భారత విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరం:


ఇకపై చదవండి pakkatelugu.com

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

Image result for us embassy

ఎన్నెన్నో ఆశలతో దేశందాటి అగ్రదేశంలో అడుగుపెట్టి ఉన్నతవిద్యలభ్యసిస్తున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరమైంది. అక్కడి ప్రభుత్వ నిర్ణయం విద్యార్థుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తుంది. నిన్నటివరకు అక్కడి స్వతంత్ర కళాశాలలకు, పాఠశాలలకు గుర్తింపు యిచ్చిన ‘ ఏక్రిడిక్ కౌన్సిల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ (ACICS)’ అనే జాతీయసంస్థనే రద్దుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఏఐసీయస్ గుర్తింపు పొందిన పాఠశాల కళాశాలల గుర్తింపు చెల్లదనడంతో అక్కడ చదువుతున్న విద్యార్థులలో కలకలం నెలకొంది.

Image result for acics ban
ఈ జాతీయ సంస్థను 1912 లో ఏర్పాటుచేసి దీనిద్వారా సాంకేతిక వృత్తి విద్యా కళాశాలలకు గుర్తింపు తప్పనిసరి చేశారు. ఐతే ఈ ఏసిఐసియస్ పర్యవేక్షణలో దాదాపు 250వరకు విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. ఐతే ఏసిఐసియస్ పనితీరులో లోపాలున్నాయని భావించి ఉన్నతస్థాయి బృందం దర్యాప్తు చేపట్టగా ఈ మండలి ప్రమాణాలులేని కళశాలలకు ,బోగస్ కళాశాలలకు సైతం గుర్తింపునివ్వడమే కాక విద్యార్థుల , పన్ను చెల్లింపు దారుల ప్రయోజనాలను కాపాడలేకపోయిందని నివేదికలో వెల్లడైంది. దీని కారణంగ ఏసిఐసియస్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకపన్నట్లు సమాచారం.

Image result for usa students
ఏఐసియస్ ద్వారా గుర్తింపు పొందిన కళాశాలలకు అమెరికా విద్యాశాఖ 18నెలల గడువు యిచ్చింది.ప్రభుత్వ నిధులుపొంది కళశాలలు నడవాలంటే ఆ కళశాలలు తిరిగి గుర్తింపు పొందవలిసియుంది. అట్లే ప్రభుత్వం విధించే కొత్త షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. ఏఐసియస్ గుర్తింపు పొందిన కళశాలలో దాదాపు 16వేల మంది అంతర్జాతీయ విద్యార్థులు తమ భవితవ్యమేమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. కాగా వీరిలో ఎక్కువమంది తెలుగు వారే కావడం గమనార్హం. పై పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల మేలుకోరి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కోమటి జయరాం నార్త్ వెస్ట్రన్ పాలీటెక్నిక్ విద్యార్థులను కలిసి ప్రత్యమ్నాయ మార్గాల గురించి చర్చించినట్లు సమాచారం. ఓపిటి మరియు ఓపిటి ఎక్ష్ టెన్షన్ విద్యార్థుల భవిత తో పాటు యితర కళాశాలల విద్యార్థుల గురించి కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారుImage result for usa students

ఇంకా ఇలాంటి సమాచారం కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...

అమెరికాలో భారత విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరం:

log in

reset password

Back to
log in