ఇండియన్ స్టైల్ సిట్టింగ్ తో మలబద్దకానికి చెక్..!


ఇకపై చదవండి pakkatelugu.com

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

ఇండియన్ స్టైల్ సిట్టింగ్ తో మలబద్దకానికి  చెక్

Image result for indian wash room

శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటికి పంపివేయాలి. లేదంటే అనారోగ్యాల పాలు కావల్సి వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే అలాంటి వ్యర్థాల్లో ప్రధానంగా చెప్పుకోదగినది మలం. మనలో అధిక శాతం మంది మలబద్దకంతోనో లేదా ఇతర కారణాలతోనే నిత్యం విరేచనం సరిగా చేయరు. దీంతో వివిధ జబ్బులకు గురి కావల్సి వస్తుంది. మనం సాధారణంగా రోజుకు 3 సార్లు భోజనం చేస్తాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలతో ముగిస్తాం. అయితే 3 సమయాల్లోనూ తప్పనిసరిగా మల విసర్జన చేయాల్సిందే. అధిక శాతం వరకు 3 సార్లు ఎవరూ వెళ్లరు. 2 సార్లు వెళ్లే వారు కూడా చాలా తక్కువగానే ఉంటారు. ఈ నేపథ్యంలోనే మల విసర్జన సాఫీగా జరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Related image

1. వెస్టర్న్ తరహా మరుగుదొడ్లకు వెళ్లేవారు 90 డిగ్రీల కోణంలో సాధారణంగా కూర్చుంటారు. అయితే ఇది చాలా తప్పు. ఎందుకంటే మల విసర్జన సరిగా జరిగేందుకు ఇది ఏమాత్రం దోహదం చేయదు. ఆ తరహా మరుగుదొడ్డి ఉన్నా సరే బేసిన్‌పై 35 డిగ్రీల కోణం వచ్చేలా చిత్రంలో చూపించినట్టు కూర్చోవాలి. దీంతో మల విసర్జన సాఫీగా జరుగుతుంది.

Related image

2. పీచు (ఫైబర్) ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రధానంగా బ్రకోలి, కాలిఫ్లవర్, క్యాబేజీ, ఆకుపచ్చని కూరగాయలు, యాపిల్స్, క్యారెట్లు, బెర్రీలు, నారింజ, నిమ్మ వంటి వాటితోపాటు సల్ఫర్ ఉండే గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ముల్లంగి వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజుకు సరాసరిగా ఒక వ్యక్తి దాదాపు 15 గ్రాముల ఫైబర్ ఉన్న ఆహార పదార్థాన్ని తింటాడు. అయితే మనకు కనీసం 25 గ్రాముల వరకు ఫైబర్ అవసరం అవుతుంది. ఎక్కువగా మలబద్దకంతో బాధపడే వారు ఫైబర్ ఉన్న పదార్థాలను తీసుకోవాలి. ఈ క్రమంలోనే వారికి గోధుమ పిండితో చేసిన రొట్టెలు, గోధుమ బ్రెడ్, నట్స్, ఆకుపచ్చని కూరగాయలు వంటివి మేలు చేస్తాయి.

Image result for indian washroom sitting position

3. టాయిలెట్ సీట్‌పై కూర్చునే విధానంలో కూడా మల విసర్జన సాఫీగా జరగడం ఆధారపడి ఉంటుంది. సీట్‌పై గుంజీలు తీసినట్టు కూర్చోవాలి. అప్పుడే సరైన భంగిమ ఏర్పడి విరేచనం సులువుగా అవుతుంది.

Image result for drinking water bottle in the morning

4. నీటిని ఎక్కువగా తాగాలి. తక్కువగా తాగితే అది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఫలితంగా మలబద్దకం సమస్య కూడా వస్తుంది. అందుకే నీరు ఎక్కువగా తాగితే విరేచనం కూడా సాఫీగా జరుగుతుంది.

Related image

5. కాఫీ తాగితే సులువుగా విరేచనం జరుగుతుందట. సో, రోజుకో కప్పు కాఫీ తాగితే మలబద్దకం సమస్య కూడా ఉండదు.

Image result for walking in the morning

6. నడకతో కూడా మల విసర్జన సాఫీగా జరిగేలా చేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా నడిస్తే అంత సులువుగా విరేచనం జరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కూర్చోవడం మాని ఎక్కువగా నడవండి.

Image result for stomach massage

7. పొట్టను సున్నితంగా మసాజ్ చేసినా విరేచనం సులువుగా జరుగుతుంది. ఇక ముందెప్పుడైనా విరేచనం సమస్యగా ఉంటే ఈ ట్రిక్‌ను ఫాలో అయి చూడండి. ఫలితం కనిపిస్తుంది.

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...

ఇండియన్ స్టైల్ సిట్టింగ్ తో మలబద్దకానికి చెక్..!

log in

reset password

Back to
log in