తాళి కట్టిన తరువాత హోమం చుట్టూ 7 అడుగులు ఎందుకు వేస్తారో మీకు తెలుసా?


ఇకపై చదవండి pakkatelugu.com

తాళి కట్టిన తరువాత హోమం చుట్టూ 7 అడుగులు ఎందుకు వేస్తారో మీకు తెలుసా?

Related image

రెండు కుటుంబాలను ఒక్కటి చేసే వేడుక పెళ్లి… అప్పటి వరకు ఒంటరిగా సాగిన వారి ప్రయాణం అప్పటి నుండి జంటగా సాగుతుంది. మన సాంప్రదాయం ప్రకారం పెళ్లికి చాలా విశిష్టత ఉంటుంది. అయిదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. బంధుమిత్రులతో, బాజా భజంత్రీలతో అదో కోలాహలం.. అన్నీ ఓకే కానీ చాలా మందిలో  ఈ పెళ్లికి సంబంధించి రెండు డౌట్స్ అలాగే ఉండిపోయాయి…అవి

1) వరుడు వధువు మెడలో మూడు ముళ్లే ఎందుకు వేస్తాడు?

హిందూ సాంప్రదాయం ప్రకారం మూడు అనే అంకెకు విశిష్టమైన ప్రదాన్యం ఉంది, త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ..ఇలా మూడు అనేది మంగళకరం అని భావిస్తారు. అందుకే మంగళసూత్రానికి ఈ మూడు ముడులు వేస్తారు. ఇంక డెప్త్ గా చెప్పాలంటే….. మానవులకు  స్థూల, సూక్ష్మ, కారణ, అనే మూడు శరీరాలు ఉంటాయట. పెళ్లి సమయంలో వేసే ఒక్కొక్క ముడి ఒక్కో శరీరానికి వేసేదట…! పెళ్లి అంటే కేవలం బాహ్య శరీరంతోనే కాదు…మొత్తం మూడు శరీరాలతో మమేకం అవడటం అనే అర్థం లో మూడు ముళ్లు వేస్తారట.!

2) తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ 7 ప్రదిక్షణలే ఎందుకు చేస్తారు?

Related image

సాధారణంగా ఏడు అడుగులు వేయడం అంటే జీవిత భాగస్వామి తో ఏడు జన్మల వరకు తోడుంటా అనే నమ్మకం ఇవ్వడం కోసమని చెబుతారు…దీనిని ఇంకా డెప్త్ గా చెప్పాలంటే ఒక్కో అడుగు ఒక్కో భరోసాను నూతన వధువరులు ఒకరికి ఒకరు ఇస్తున్నట్టు లెక్క.

మొదటి అడుగు: అన్నవృద్దికి…………మన దేశాన్ని గతంలో అన్నపూర్ణ గా పిలిచారు, దానికి తోడు గతంలో మన ప్రధాన జీవనాదారం వ్యవసాయం.. అందుకే మొదటి అడుగులో పంటలు పండాలని ఆకాంక్షిస్తూ వేసేది.

Related image

రెండవ అడుగు: బలవృద్దికి………. నూతన వధువరులతో పాటు ఇరు కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని.

Related image

మూడవ అడుగు: ధనప్రాప్తి కలగాలని.

Related image

నాల్గవ అడుగు: ఆలుమగల్లో సదా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని.

అయిదవ అడుగు: ఇతరులకు మేలు  చేసే నిమిత్తం.

ఆరవ అడుగు: దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు, అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని  ఆశిస్తూ వేసేది.

Image result for marriage 7 steps

ఏడవ అడుగు: శారీరకంగా, మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని ప్రసాదించాలని ఆ అగ్ని దేవుడిని ప్రార్థిస్తూ వేసే అడుగు.

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...

తాళి కట్టిన తరువాత హోమం చుట్టూ 7 అడుగులు ఎందుకు వేస్తారో మీకు తెలుసా?

log in

reset password

Back to
log in