తప్పక చూడాల్సినవి

రోడ్డు మంచిగా లేనందుకు రూ. 247 కోట్లు జరిమానా వేసిన కలెక్టర్

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

రోడ్డు మంచిగా లేనందుకు రూ. 247 కోట్లు జరిమానా వేసిన కలెక్టర్

Related image

మన ఇండియా లో చాలా చోట్ల రోడ్డు సరిగా లేకపోవడం అనేది మాములు విషయమే. రోజు న్యూస్ పేపర్ లో టీవీ లో చూస్తూనే ఉంటాము రోడ్ సరిగా లేక చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు వేసిన కంట్రాక్టరు పనో లేదా అతనికి పని ఇచ్చిన మన గవర్నమెంట్ తప్పో తెలీదు కానీ చాలా దిక్కుల నాణ్యత లేని రోడ్డు లనే చూస్తుంటాము.

Image result for under construction road in maharashtra

ఇలానే నాణ్యత లేని రోడ్ వేస్తున్న మహారాష్ట్ర లోని ఒక ప్రయివేటు కంపెనీ బాగోతం బయటపడింది. సరియైన రోడ్డు వేయనందుకు కన్స్ట్రక్షన్ కంపెనీ కి ఏకంగా 247 జరిమానా విధించారు అక్కడి స్థానిక కలెక్టర్. వివరాల లోకి వెళితే మహారాష్ట్ర కి చెందిన పాల్గర్ జిల్లా కలెక్టర్ అభిజిత్ బంగర్, మనోర్ వాడ భివాండీ అనే హైవే రోడ్డు నిర్మాణాన్ని చేసిన సుప్రీం ఇండియా లిమిటెడ్ అధికారులకి రూ. 247 కోట్లు కట్టాల్సిందిగా 2016 డిసెంబర్ 8  న ఉత్తరువులు జారీ చేసారు. ఇదంతా కట్టనికి ఒక నెల గడువు ఇచ్చారు.

మనోర్ వాడ భివాండీ  హైవే రోడ్డు మంచిగా నిర్మించక పోవడం తో రోడ్డు పైన చాలా ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతున్నారని సామజిక వేత్త నీలేష్ ఆమరణ నిరాహారణ దీక్ష చేసాడు. ఈ విషయాన్నీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం తో అతనే స్వయంగా రోడ్డు నాణ్యతను పరీక్షించాడు. అయితే సుప్రీం కంపెనీ వారు అక్రమంగా ఇసుక తరలించి నాణ్యతలేని రోడ్డు నిర్మించారని ఆగ్రహం తో కలెక్టర్ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు.

Related image

అంతే కాకుండా రోడ్డు పైన మరణించిన వారి కుటుంబాలకి 25 లక్షల నష్ట పరిహారం కూడా చెల్లించాల్సిందిగా ఆదేశించాడు. అయితే కలెక్టర్ చెప్పిన దానికి సుప్రీం కంపెనీ వారు మాట్లాడానికి ఒప్పుకోకుండా కోర్టుకి వెళ్తామని చెప్పారు. రోడ్డు పనుల్లో మేము ఎలాంటి తప్పు చేయలేదని పనులన్నీ సక్రమంగా కొనసాగించమని ఇమెయిల్ ద్వారా చెప్పారు.

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Related Articles