తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Crime news: సినీ నటుడు జగదీష్ అరెస్ట్… రిమాండ్ కు తరలింపు

మహిళ ఆత్మహత్య కేసులో సినీ నటుడు జగదీష్ ప్రతాప్ బండారిని హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌కి స్నేహితుడిగా కేశవ పాత్రలో జగదీష్ నటించాడు. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోన్న ఒక మహిళ.. మరో వ్యక్తితో గత నెల 27 న ఏకాంతంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని జగదీష్ బెదిరించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో జగదీష్‌పై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.

Also Read: మిచౌంగ్ తుపాను.. తెలంగాణపై ఎఫెక్ట్

ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు జగదీష్‌ను నిందితుడిగా గుర్తించారు. అయితే, ఈరోజు వరకు జగదీష్‌ను అరెస్ట్ చేయడం కుదరలేదు. మొత్తానికి పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న జగదీష్‌ను ఈరోజు పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో జగదీష్‌కు పరిచయం ఉందని.. ఇద్దరూ సినీ రంగంలో కలిసి పనిచేశారని పోలీసులు తెలిపారు.

Also Read: నేడు ప్రముఖుల పుట్టిన రోజు.. వీరే

‘మల్లేశం’ సినిమాతో తెరంగేట్రం చేసిన జగదీష్.. ఆ తర్వాత ‘జార్జిరెడ్డి’, ‘పలాస 1978’ సినిమాల్లో నటించాడు. అయితే, నాలుగో సినిమా ‘పుష్ప’తో జగదీష్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ ఏడాది ‘బుట్టబొమ్మ’, ‘సత్తిగాని రెండెకరాలు’ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాలో జగదీష్ నటిస్తున్నాడు. ఈ సినిమాలోనూ ఇతడిది కీలక పాత్రే. మరి జగదీష్ అరెస్ట్ ‘పుష్ప 2’ షూటింగ్ మీద ఏమైనా ప్రభావం చూపుతుందా.. లేదంటే ఇప్పటికే అతడి షూటింగ్ పార్ట్ పూర్తయ్యిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button