తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Snake Pooja: పిచ్చికి పరాకాష్ట.. పామును బంధించి ‘చవితి’ పూజలు

దేవుడి పేరిట జంతువులను (Animals) హింసించడం నేరం. అందుకే చాలా దేవాలయాల్లో జంతు బలి (Animal sacrifice) నిషేధం. జంతువులను హింసించడం దారుణంగా పరిగణిస్తారు. కానీ ఓ కుటుంబం నాగులచవితి రోజు పామును బంధించి పూజించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆ కుటుంబం చేసిన పనిపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Also Read ఓయూ విద్యార్థుల ఆశాకిరణం ’కాంగ్రెస్ పార్టీ‘.. ఎన్నికల్లో మద్దతు

నాగుపామును బంధించి పూజలు చేస్తున్న వీడియోను ‘ఎక్స్’లో మానవ హక్కుల కార్యకర్త డాక్టర్ బి.కార్తీక్ నావయన్ పోస్టు చేశారు. డబ్బాలో ఉన్న పామును ఓ మహిళ పూజిస్తుంది. డబ్బాకు (Box) పూలు పెడుతుండగా పాము బుసలు కొడుతుంది. దానికి ఆమెతోపాటు ఆమె కుమారుడు జంకుతారు. దీనికి ఇంట్లో ఉన్న వ్యక్తి ‘ఏం కాదులే’ అని వారిని ప్రోత్సహిస్తాడు. అనంతరం అగరబత్తులు (Incenses) వెలగించి గంట కొడుతూ పామును పూజిస్తారు.

Also Read బీఆర్ఎస్ కు మద్దతు పలకాలని ’ఉద్యోగి‘కి వేధింపులు.. ఈసీకి ఫిర్యాదు

వారు ఇలా చేయడంపై డాక్టర్ కార్తీక్ మండిపడ్డారు. ‘పిచ్చి (Mad) పరాకాష్ట అంటే ఇదేనేమో.. నాగుపాముని ప్లాస్టిక్ డబ్బాలో బంధించి పూజలు (Poojas), 🤭 ఏందో… ఎటుపోతున్నాము. ఎవరి పిచ్చి వాళ్ళకే ఆనందం😂’ అని అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియోను చూసినవారంతా వారి తీరుపై ఆగ్రహం (Fire) వ్యక్తం చేస్తున్నారు. పామును బంధించి దానిని ఇబ్బంది పెట్టి పూజిస్తే పూజా ఫలం కూడా దక్కదు అని చెబుతున్నారు. ఇలా చేయడాన్ని జంతు ప్రేమికులు ఖండిస్తున్నారు. అయితే పూజిస్తున్న వాళ్లు ఎక్కడ.. ఎవరో తెలియదు. కానీ వారు తెలుగువారుగా మాత్రం తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button