చపాతీ రైస్ లో ఏది తింటే మంచిది

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో అసలేం ఉండాలి :

ఉరుకులు పరుగుల నేటి ప్రపంచంలో మనఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నది చాలా తక్కువే. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా అన్నం ఉంటుంది. అసలు నేడు మనం తింటున్న బియ్యం పరిపూర్ణ పోషకాలను మన శరీరానికి అందిస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. దీనివలన శరీరానికి అందాల్సిన పోషకాలు తగినస్థాయిలో అందడంలేదు. మరి దానికి తగిన పరిష్కారం గోధుమ పిండితో చేసిన చపాతిలనే చెప్పవచ్చు.మరి మనపూర్వీకులు బియ్యం తిని శారీరక శ్రమను ఎక్కువగ చేయలేదా అంటే వారు దంపుడు బియ్యం తినేవారు. వాటిలో సంబంధిత పోషకాలతో పాటు బి కాంప్లెక్స్ విటమిన్స్ విరివిగా ఉండేవి . పిజా బర్గర్ల వెంట పరుగిడుతున్న నేటి సమాజంలో సరియైన పోషకాలను అందించేది చపాతీలే. వీటిలో ఉన్న ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటివాటితో పాటు సూక్ష్మ స్థూల పోషకాలు తగినంత పాళ్లలో శరీరానికి అందిస్తాయనడంలో సందేహం లేదు.Image result for chapathi
చాలా మందికున్న ఒక అలవాటేంటంటే జ్వరం వచ్చినపుడో, గాయాలేవైనా అయినప్పుడో లేదా చక్కెర వ్యాధిగ్రస్తులో చపాతీలు తినడం మేలనుకుంటారు . కాని నిత్య జీవితంలో మన శరీరం చేసే శ్రమకు తగిన క్యాలరీల శక్తి కేవలం మన తినే అన్నం లో మనకు దొరకదు.అందుకే పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్న ముఖ్య విషయం రోజూవారి ఆహారంలో చపాతీ తీసుకోవడం మంచిదని అంటున్నారు.
Image result for chapathi

మీరు తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు:

అంతేకాక గోధుమలలో తక్కువశాతం కొవ్వు ఉండి పీచు పదార్థాలు అధికంగా ఉండడం వలన హృదయ సంబంధిత వ్యాధులు దరిచేరవు.బియ్యం పాలిష్ చేయడం వలన వాటిలోనున్న ఫైబర్ , ఐరన్ ,కాల్షియం వంటి పోషకాలు కోల్పోతాయి. యివన్నీ గోధుమలలో పుష్కలంగా ఉండడం వలన చపాతీలే ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనదే కాబట్టి మనంతీసుకునే ఆహారం విషయంలో మనమే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరో ముఖ్య విషయమేమిటంటే అధిక బరువు ఉన్నవారు తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి , బరువు పెరగకుండా ఉండడానికి కూడా ఈ చపాతీలు ఎంతో ఉపయోగకరం.రోజూ ఉదయం మరియు రాత్రిపూట చపాతీలు తినడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాక అధిక బరువు మరియు తదితర రోగాలబారినుండి రక్షణయే కాక ఆహ్లదకర ఆనంద జీవితానికి మంచి సంజీవనిలా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు .Image result for chapathi

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.