మీరు కార్డు స్వైప్ చేస్తున్నప్పుడు ఈ 6 విషయాలు మిషిన్ లో తప్పక గమనించండి..లేదంటే.?

నేటి డిజిటల్ కాలంలో క్రెడిట్ కార్డులు వినియోగించేవారి సంఖ్యా పెరుగుతూనే ఉంది. కాష్ బ్యాక్ లాంటి ఆఫర్స్ అందించడంతో చాలా మంది క్రెడిట్ కార్డుల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇందుకు త‌గిన‌ట్టుగానే నేర‌గాళ్లు కూడా న‌కిలీ క్రెడిట్ కార్డుల‌ను త‌యారు చేయ‌డం మొదలుపెట్టారు. అది కూడా క్రెడిట్ కార్డు స్కిమ్మ‌ర్‌ మిషిన్ల‌ను ఉప‌యోగించి ఆ ప‌ని చేస్తున్నారు. వాటి ద్వారా మ‌న క్రెడిట్ కార్డుల స‌మాచారాన్ని దొంగిలించి మ‌న కార్డుల‌ను పోలిన కార్డుల‌ను డూప్లికేట్ రూపంలో త‌యారు చేసి వాటి ద్వారా డ‌బ్బుల‌ను దోచుకుంటున్నారు. ఈ త‌ర‌హా నేరాలు ఆపేదెలా అంటే అందుకు ప‌రిష్కారం ఉంది. స్కిమ్మ‌ర్ మిషిన్ అంటే ఏంటి.. ఎలా ప‌నిచేస్తాయి.. వాటిని ఎలా గుర్తించాలి అనే విషయాలు తెలుసుకుంటే మనం జాగ్రత్త పడవచ్చు. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* స్కిమ్మ‌ర్ మిషిన్లు మ‌నం కార్డుల‌ను స్వైప్ చేసే యంత్రాల‌ను పోలి ఉంటాయి. కానీ జాగ్రత్త‌గా ప‌రిశీలిస్తే స్కిమ్మ‌ర్ మిషిన్ల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. ఎలా అంటే..

* సాధార‌ణ కార్డు స్వైపింగ్ మిషిన్ల‌తో పోలిస్తే స్కిమ్మ‌ర్ మెషిన్లు కొంత వెడ‌ల్పు ఎక్కువ‌గా ఉంటాయి.

* అస‌లైన స్వైపింగ్ మిషిన్‌లో మ‌నం కార్డు పెడితే గ్రీన్ లైట్ వ‌స్తుంది. స్కిమ్మ‌ర్ స్వైపింగ్ మిషిన్ల‌లో గ్రీన్ లైట్ రాదు.

* సాధార‌ణంగా మ‌నం కార్డును స్వైపింగ్ మిషిన్‌లో పెట్టిన‌ప్పుడు అందులో చాలా భాగం బ‌య‌ట‌కు ఉంటుంది. దీంతో ఆ మిషిన్ నిజ‌మైన మెషిన్ అని, స్కిమ్మ‌ర్ మిషిన్ కాద‌ని మ‌న‌కు తెలుస్తుంది. అదే స్కిమ్మ‌ర్ మిషిన్ అయితే కార్డు చాలా వ‌రకు లోప‌లికి పోతుంది. కేవ‌లం కొంత భాగం మాత్ర‌మే బ‌య‌ట‌కు ఉంటుంది. ఇలాంటి మిషిన్ క‌నిపిస్తే వెంట‌నే కార్డు తీయండి. ఆ వ్య‌క్తుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయండి.

* మ‌న కార్డులో బ్యాలెన్స్ ఉన్నా స్వైప్ చేస్తుంటే ఎర్ర‌ర్లు వ‌స్తే అప్పుడు ఆ మిషిన్ ను స్కిమ్మ‌ర్ స్వైపింగ్ మిషిన్‌గా అనుమానించాలి. ఈ సంద‌ర్భంలో మ‌న కార్డులోని స‌మాచారం చోరీకి గుర‌వుతుంది.

* స్వైపింగ్ మిషిన్ల‌కు పెన్ను లాంటి స్టైల‌స్ ఉంటే అది ఖచ్చితంగా స్కిమ్మ‌ర్ మిషిన్ అయి ఉంటుంది. క‌నుక మీరు కార్డు స్వైప్ చేసే మిషిన్‌కు స్టైల‌స్ ఉందో లేదో చెక్ చేస్తే అది స్కిమ్మ‌ర్ మెషిన్ అవునో, కాదో గుర్తించ‌వ‌చ్చు. అనంత‌రం అందుకు త‌గిన విధంగా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

* స్కిమ్మ‌ర్ మిషిన్లలో కార్డును పెట్టి స్వైప్ చేస్తే మిషిన్ స్క్రీన్ డ‌ల్ అవుతుంది. దీన్ని గుర్తిస్తే స్కిమ్మ‌ర్ మిషిన్ అవునో కాదో తెలిసిపోతుంది. దాంతో జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అయితే అలా ఒక వేళ మిషిన్‌లో కార్డు పెట్టిన‌ప్పుడు స్క్రీన్ డ‌ల్ అయితే ఆ స‌మ‌యంలో మ‌న కార్డులోని స‌మాచారం చోరీకి గుర‌వుతున్న‌ట్టు తెలుసుకోవాలి.

ఇక కార్డు చోరీకి గురైనా, మీ కార్డు స్కిమ్మింగ్ అయిన‌ట్టు భావిస్తే వెంట‌నే కార్డును బ్లాక్ చేయండి. ఎందుకంటే స్కిమ్మ‌ర్ మిషిన్ల ద్వారా కార్డులోని డేటాను మాత్ర‌మే తస్క‌రించ‌గ‌ల‌రు. డ‌బ్బును కాదు. దీంతో ఆ కార్డు ద్వారా జ‌రిగే లావాదేవీల‌కు బ్రేక్ ప‌డుతుంది. అలాగే ఎక్క‌డైనా మీ కార్డును స్వైపింగ్ చేస్తే స్వైపింగ్ మెషిన్ వ‌ద్ద మీరు ఖచ్చితంగా ఉండండి.

అక్క‌డి ఉద్యోగుల‌కు, సిబ్బందికి మీ కార్డును ఇవ్వ‌కండి. అదేవిధంగా కార్డు స్వైప్ చేసిన త‌రువాత బిల్ అమౌంట్ క‌రెక్ట్‌గా ఉందో, లేదో చెక్ చేసుకోండి. ఇక చివ‌రిగా మీ క్రెడిట్ కార్డుకు ఇన్సూరెన్స్ పాల‌సీ తీసుకోండి. దీంతో దుండ‌గుల చేతుల్లోకి కార్డు వివ‌రాలు వెళ్లి డ‌బ్బు దొంగ‌త‌నం జ‌రిగినా మీకు ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది.

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article