నేష‌న‌ల్ హైవే ల‌కు…నెంబ‌రింగ్ ఎలా ఇస్తారో తెలుసా?

మనం ప్రయాణిస్తున్నప్పుడు అక్కడక్కడా రోడ్లు వెంబడి N.H-1,N.H-65 లాంటి అనేక నంబర్స్ ను గమనిస్తాము. కానీ, అవి ఎందుకు? ఏమిటి? ఎలా ? అని ఎప్పుడైనా ఆలోచించారా.. ఇప్పుడు మనం ఆ వివరాల గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రోడ్ల‌ను గుర్తించ‌డంలో గంద‌ర‌గోళం లేకుండా.. సింపుల్ గా గుర్తుపెట్టుకునేందుకు నెంబరింగ్ ఇచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే..

Related image

రోడ్ల‌కు నెంబ‌రింగ్ ఎలా ఇస్తారు?

* రోడ్ల‌కు.. ప‌డ‌మ‌ర టు తూర్పు, ఉత్త‌రం టు ద‌క్షిణం కు నెంబ‌రింగ్ ఇస్తారు.
ప‌డ‌మ‌ర నుండి తూర్పు కు వెళ్ళే ర‌హ‌దారుల‌కు.. బేసి సంఖ్య‌ను.. ఉత్త‌రం నుండి ద‌క్షిణంకు వెళ్ళే ర‌హ‌దారుల‌కు స‌రి సంఖ్య‌ను పెడ‌తారు.

* ప‌డ‌మ‌ర నుండి తూర్పుకు….1,3,5,7,9,…(N.H-1- జ‌మ్మూ కాశ్మీర్, N.H-87 త‌మిళ‌నాడు.)

* ఉత్త‌రం నుండి ద‌క్షిణం కు…2,4,6,8… (NH-2 నార్త్ – ఈస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా…..NH-68 రాజ‌స్థాన్ – గుజ‌రాత్.!)

* మేజ‌ర్ ర‌హ‌దారులు…. 1 డిజిట్, 2 డిజిట్ నెంబ‌ర్స్ నే క‌లిగి ఉంటాయి. త్రి డిజిట్ నెంబ‌ర్స్ ఉన్న నేష‌న‌ల్ హైవేస్ ను…ఆఫ్ షూట్ హైవేలు అంటారు. ఇవి పెద్ద హైవేస్ కు అనుసంధానంగా ఉంటాయి.

Related image

*ఉదాహ‌ర‌ణ‌కు….102, 202, 302… అంటే ఇందులో చివ‌రి రెండు అంకెలు ఓ పెద్ద జాతీయ ర‌హ‌దారిని సూచిస్తాయి. అంటే.. ఈ నెంబ‌ర్ ర‌హ‌దారులు.. 2 వ నెంబ‌ర్ జాతీయ ర‌హ‌దారికి అనుసంధానంగా ఉండేవ‌న్న మాట‌!!

*ఇవే గాక‌…966A, 527B అనే నెంబ‌ర్స్ కూడా ఉంటాయి. దీని అర్ధం ఏంటంటే.. 966A, 66 అనే జాతీయ ర‌హ‌దారి యొక్క స‌ఫిక్స్ ర‌హదారి అని అర్థం.!

* హైద్రాబాద్ టు విజ‌య‌వాడ‌ N.H-9 అని గ‌తంలో ఉండేది.. ఇప్పుడు దాన్ని N.H-65 గా మార్చారు. ఈ నెంబర్ మార్పు 2010 ఏప్రిల్ 28 న జ‌రిగింది.

Image result for national highways in india

తేలికగా గుర్తుపెట్టుకునేందుకు..

* N.H-1.. ప‌డ‌మ‌ర నుండి తూర్పుకు వెళ్ళే ర‌హ‌దారి.

* NH-68.. ఉత్త‌రం నుండి ద‌క్షిణం.

* NH-102.. ఉత్త‌రం నుండి ద‌క్షిణం వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారికి అనుసంధానమైన ర‌హ‌దారి (ఆఫ్ షూట్ ర‌హ‌దారి).

* NH-966A, NH-527B.. ఉత్త‌రం నుండి ద‌క్షిణం వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారికి స‌ఫిక్స్ ర‌హ‌దారి.

Related image

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article