ఎయిర్‌టెల్ కు భారి షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఎందుకో తెలుసా..?

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కు భారీ షాక్ తగిలింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను అతిక్రమించినందుకు గాను భారీ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అసలు విషయం ఏమిటంటే.. గ‌తంలో ఎయిర్‌టెల్ టెలికాం సేవలను వాడుతున్న కస్టమర్లు తమ మొబైల్ నంబర్లను ఆధార్‌కు లింక్ చేసే సమయంలో వారికి తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా ఎయిర్‌టెల్ సంస్థకు చెందిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ వారి పేరిట ‘ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను’ ఓపెన్ చేసింది. అయితే ఎయిర్‌టెల్ ఇలా చేయ‌డంతో ఆ బ్యాంక్ ఖాతాలు ఎన్‌పీసీఐకి అనుసంధానమయ్యాయి. దీంతో ఆ కస్టమర్లకు చెందిన వంట గ్యాస్ సబ్సిడీ వారి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో జమ అయింది.

Related image

ఈ క్ర‌మంలో అలా జమ అయిన నగదును ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియలేదు. ఇక కొందరు తమకు వస్తున్న వంట గ్యాస్ సబ్సిడీ ఒక్కసారిగా బంద్ అయ్యే సరికి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో చివరకు వారు తమకు వచ్చే సదరు గ్యాస్ సబ్సిడీ మొత్తం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో జమ అయినట్లు గుర్తించి ఆర్‌బీఐకి ఫిర్యాదు చేశారు. ఇలా వినియోగదారులకు చెందిన మొత్తం రూ.47 కోట్ల గ్యాస్ సబ్సిడీ ఆ అకౌంట్లలో జమ అయినట్టు గుర్తించారు.

Related image

దీంతో రంగంలోకి దిగిన ఆర్‌బీఐ తొలుత ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌పై కొద్ది రోజులు నిషేధం విధించింది. పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును వినియోగదారులు తమ తమ బ్యాంక్ అకౌంట్లకు ఉచితంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వీలు కల్పించాలని ఆర్‌బీఐ ఎయిర్‌టెల్‌కు ఆదేశించింది. ఇక మరో వైపు సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఎయిర్‌టెల్‌లో ఆధార్ లింకింగ్ ప్రాసెస్‌ను యూఐడీఏఐ నిలిపివేసింది.

Image result for reserve bank of india

కస్టమర్లకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా వారి పేరిట ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసిన విషయం వాస్తవమే అని తెలిసిందని, దీంతో ఆ సంస్థపై రూ.5 కోట్ల ఫైన్ వేశామని ఆర్‌బీఐ తెలియజేసింది. కేవైసీ మార్గదర్శకాల పట్ల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ పేర్కొంది. అవును మ‌రి, క‌స్ట‌మ‌ర్ల‌కు తెలియ‌కుండా, వారి ప్ర‌మేయం లేకుండా వారి పేరిట బ్యాంక్ అకౌంట్ల‌ను ఓపెన్ చేయ‌డం అంటే.. అది ఎంత పెద్ద నేర‌మో కదా.

Related image

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article