వాట్సప్ లో ఈ చిన్న ట్రిక్ తెలుసుకుంటే ప్రతి ఒక్కరితో ఆటాడుకోవచ్చు..

స్నేహితులు, బంధువులు లేదా పరిచయస్తుల నుంచి మీకు ఓ వాట్సప్ మెస్సేజ్ వచ్చినప్పుడు సాధారణంగా ఆ మెస్సేజ్ చూస్తాము. మనం చూసినట్లుగా వెంటనే బ్లూ టిక్స్ పడతాయి.. ఆ మెస్సేజ్ చూసి మనం రిప్లయ్ ఇవ్వకపోతే వారికి కోపం, చిరాకు రావచ్చు. అయితే, మనం ఆ మెస్సేజ్ చూసిన కూడా వారికి తెలియకుండా ఉండాలంటే ఈ బ్లూ టిక్ ఆప్ష‌న్ ను వాట్సాప్‌లో డిజేబుల్ చేయ‌వ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

* వాట్సాప్‌లో మెసేజ్‌ రాగానే నోటిఫికేషన్‌ ప్యానెల్‌ను స్క్రోల్ డౌన్‌ చేసి ఎరోప్లేన్‌ మోడ్‌ను ఆన్ చేయాలి.

* ఇప్పుడు వాట్సాప్‌లోకి వెళ్లి మెసేజ్ చదవాలి.

* వాట్సప్‌ క్లోజ్ చేయాలి.

* మళ్లీ ఎరోప్లేన్‌ మోడ్‌ను ఆఫ్ చేయాలి.

* ఆఫ్‌లైన్‌లో మీరు వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి మెసేజ్‌ చదివితే పంపిన వారికి మీరు చదివిన విషయం తెలియదు. బ్లూటిక్స్‌ కనిపించవు.

* అయితే వాట్సాప్‌ను పూర్తిగా క్లోజ్‌ చేసి ఎరోప్లేన్‌ మోడ్‌ను ఆన్‌ చేయాలి.

* సింపుల్‌గా బ్యాక్‌బటన్‌ నొక్కి క్లోజ్‌ అయింది అనుకుంటే సరిపోదు.

* ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌ యాప్‌ రన్‌ అవుతుంటే సింక్రనైజ్‌ అయి బ్లూటిక్స్‌ కనిపించే అవకాశం ఉంటుంది.

* వాట్సాప్ సెట్టింగ్స్‌లో అకౌంట్‌ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోండి. అందులో చివర ఉండే రీడ్ రెసీప్ట్స్ అనే ఆప్షన్ దగ్గర టిక్ మార్క్‌ను తీసేయండి. దీంతో అవతలివాళ్లకు మీరు చదివినట్లు బ్లూటిక్స్ కనిపించవు. ఇలా కూడా వాట్సాప్‌లో బ్లూ టిక్స్ రాకుండా చూడ‌వ‌చ్చు.

Image result for whatsapp tricks

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article