బ్రేకింగ్ న్యూస్: ‘ఛత్రపతి’ విలన్‌ ఇకలేరు

బాలీవుడ్‌ నటుడు నరేంద్ర ఝా గుండెపోటుతో బుధవారం ఉదయం 5 గంటలకు ముంబయిలోని తన ఫాం హౌస్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 55 సంవత్సరాలు. ఇప్పటికే ఆయన రెండుసార్లు గుండెపోటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కోకిలాబెన్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. మూడోసారి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు.

Related image

నరేంద్ర ఝా అనేక హిందీ చిత్రాల్లో, టీవీ షోలలో కూడా నటించారు. హమారీ అధూరి కహానీ, ఫోర్స్‌ 2, మొహెంజదారో, రయీస్‌, ఘాయల్‌ వన్స్‌ అగైన్‌, కాబిల్‌ తదితర చిత్రాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో ఛత్రపతి, యమదొంగ, లెజెండ్‌ సినిమాల్లో విలన్‌ పాత్ర పోషించారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సాహో’లోనూ నరేంద్ర ఝా నటించాల్సి ఉందట.

Image result for narendra jha

నరేంద్ర ఝా మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోనూసూద్‌, అశోక్‌ పండిత్‌ తదితరులు ట్వీట్లు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article