బాబాయ్ ఏ కదా అని.. “చదివిస్తా అంటే దగ్గరకు వెళ్ళింది.. చివరికి ఏమైందంటే..?

నేటి సమాజంలో మహిళలపై రోజురోజుకు లైంగిక దాడులు తారాస్థాయికి చేరుతున్నాయి. ఆడవాళ్లకు బయటే కాదు.. ఇంట్లో కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొంది. ఇక కొంద‌రైతే మాయ మాట‌లు చెప్పి న‌మ్మించి, మోసం చేస్తూ, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్ప‌డుతూ వారిని లొంగ‌దీసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనొకటి క‌డ‌ప‌లోని క‌మ‌లాపురంలో జరిగింది. అసలు వివరాల్లోకి వెళ్తే..

Related image

క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురంలో జిమ్ సెంట‌ర్ నిర్వ‌హిస్తున్న ఓ వ్య‌క్తికి మైదుకూరులో బంధువులున్నారు. ఒక‌సారి అత‌ను అక్క‌డికి వెళ్లాడు. వ‌రుస‌కు త‌న‌కు అన్న అయ్యే ఓ వ్య‌క్తి ఇంటికి అత‌ను వెళ్లాడు. వారి ఇంట్లో ఇంట‌ర్ చ‌దువుతున్న ఓ యువ‌తి ఉండేది. స‌ద‌రు జిమ్ మాస్ట‌ర్ ఆ యువ‌తికి వ‌రుస‌కు బాబాయి అవుతాడు. ఈ క్ర‌మంలో ఆమెను క‌మ‌లాపురంలో త‌న ఇంట్లో ఉంచి చ‌దివిస్తాన‌ని చెప్ప‌డంతో ఎటూ వ‌రుస‌కు బాబాయే అవుతాడు క‌నుక ఆ జిమ్ మాస్ట‌ర్ వెంట త‌మ కూతుర్ని ఆమె త‌ల్లిదండ్రులు పంపించారు.

అలా క‌మ‌లాపురంలో స‌ద‌రు జిమ్ మాస్ట‌ర్ ఇంట్లో ఆ యువ‌తి రెండు నెల‌లు ఉన్న‌ది. కాలేజీలో చేరి చ‌దువుతోంది. అయితే ఆ రెండు నెల‌ల కాలంలో జిమ్ మాస్ట‌ర్ ఆమెపై క‌న్నేశాడు. ఎలాగైనా ఆమెను లొంగ దీసుకోవాల‌ని మాయ మాట‌లు చెప్పాడు. త‌న‌కు జిమ్ నేర్పిస్తాన‌ని, దీంతో ఎస్ఐ జాబ్ పొంద‌వ‌చ్చ‌ని అని చెప్పి ఆ యువ‌తిని శారీర‌కంగా లొంగ‌దీసుకున్నాడు.

అయితే అత‌ని చేష్టలు న‌చ్చ‌క‌పోవడంతో ఆ యువ‌తి తిరిగి సొంత ఇంటికి వెళ్ల‌గా కుటుంబ స‌భ్యులు న‌చ్చ‌జెప్పి తిరిగి ఆమెను క‌మలాపురం పంపించి అక్క‌డి బీసీ హాస్ట‌ల్‌లో చేర్పించారు. అయితే కుటుంబ స‌భ్యుల‌కు ఈ విష‌యాన్ని ఆ యువ‌తి చెప్ప‌లేదు. ఎందుకంటే ఆమెకు చెందిన ప‌లు ఫొటోలు, వీడియోలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని ఆ జిమ్ మాస్ట‌ర్ చెప్పి ఆ యువ‌తిని బెదిరించాడు. దీంతో ఆమె అస‌లు విష‌యం చెప్ప‌లేదు.

అలా ఆ యువ‌తి బీసీ హాస్ట‌ల్‌లో ఉన్న‌ప్ప‌టికీ అత‌ను ఆమెను లొంగ‌దీసుకుంటూనే ఉన్నాడు. ఫొటోలు, వీడియోలు చూపించి ఆమెను భ‌య‌పెట్టి బ్లాక్‌మెయిల్ చేసేవాడు. అయితే చివ‌ర‌కు ఆమె ఎగ్జామ్స్ దగ్గ‌ర ప‌డ్డాయి. అయినా ఆ కామాంధుడు వ‌ద‌ల్లేదు. ఈ క్ర‌మంలో ఆమె త‌ప్పించుకోవాల‌ని చూసింది. అయితే అత‌ను ఆమె హాల్ టిక్కెట్ తీసుకుని బెదిరించాడు.

Image result for raped women

దీంతో ఆ యువ‌తి పోలీసుల‌కు కంప్లెయింట్ చేద్దామ‌ని వెళితే అక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియ‌లేదు. ఇక ఆ యువ‌తి విష‌యం తెలుసుకున్న డీఎస్‌పీ స్వ‌యంగా కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టడంతో ఇప్పుడీ విష‌యం అక్క‌డ హాట్ టాపిక్‌గా మారింది.

అయితే పోలీసులు స‌ద‌రు జిమ్ మాస్ట‌ర్‌ను ర‌హ‌స్యంగా త‌మ దైన శైలిలో విచారిస్తున్న‌ట్టు తెలిసింది. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. మ‌రో వైపు ఫోక్సా చట్టం ప్రకారం కమలాపురం పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తున్నా పోలీసులు మాత్రం వివరాల‌ను బయటికి వెల్లడించడం లేదు.

Related image

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article