ఆ హీరో చెంప పగలగొట్టిన రాధికా ఆప్టే..!!

హీరోయిన్స్ లలో చాలామంది వరుసగా గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల సంగతులను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది చిత్ర పరిశ్రమపై హాట్ కామెంట్స్ చేసింది రాధిక. ఇక్కడ హీరోయిన్లను వివక్షాపూరితంగా చూస్తారని కూడా రాధిక వెల్లడించింది. అభిప్రాయం ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్పడం ఆమెకు అలవాటు.

Related image

కాగా, తను నటించిన తొలి దక్షిణాది సినిమాలో హీరోను కొట్టానని రాధిక చెప్పింది. ఆ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లిన తొలి రోజే ఆ హీరో తనతో అనుచితంగా ప్రవర్తించాడని, పక్కన వచ్చి కూర్చుని తన కాలిని అతడి కాలితో రుద్దడం మొదలుపెట్టాడని.. కనీసం పరిచయం కూడా లేని తనతో అతడు అలా ప్రవర్తించడంతో తన కోపం హద్దులు దాటేసిందని రాధిక చెప్పుకొచ్చింది. వేరే ఆలోచన లేకుండా అతడి చెంప చెల్లుమనిపించాను అని.. బాలీవుడ్ నటి నేహా దూపియా నిర్వహించే టాక్ షోకు హాజరైన రాధిక ఈ వ్యాఖ్యలు చేసింది. అతడు ఒక స్టార్ హీరో అని.. చెప్పిన రాధిక అతడి పేరును మాత్రం చెప్ప లేదు.

Related image

కాగా, రాధికా ఆప్టే లెజెండ్, లయన్, రక్త చరిత్ర వంటి సినిమాల్లో నటించింది. తమిళంలో ”కబాలి” సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది.

Image result for radhika apte

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article