‘ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్’ ప్రచారం…. నటి గిలు జోసెఫ్ ఫోటో, కేసు నమోదు!

ప్రముఖ మలయాళి నటి, రచయిత, మోడల్ గిలు జోసెఫ్ వివాదంలో చిక్కుకుంది. మలయాళ మ్యాగజైన్ ‘గృహలక్ష్మి’ కవర్‌పేజ్‌ కోసం బిడ్డకు పాలిస్తున్నట్లు గిలు జోసెఫ్ ఓ ఫొటోకు పోజిచ్చింది. బిడ్డకు బహిరంగంగా పాలిస్తే తప్పేంటని మ్యాగజైన్ చేపట్టిన క్యాంపెయిన్‌కు ఆమె మద్దతుగా నిలవడంతో ఆ ఫొటోను కవర్‌పేజ్‌పై ప్రచురించారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిడ్డకు చనుపాలిస్తు, కెమెరావైపు గర్వంగా చూస్తున్నట్టు ఈ కవర్ పేజీపై గిలు కనిపిస్తుండగా, అసలు పెళ్లికూడా కాని గిలుతో ఈ ఫొటో షూట్ లు, అసభ్యకర చిత్రాలు ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మేగజైన్ ప్రచురణకర్తలతో పాటు గిలు జోసెఫ్ పైనా పోలీసు కేసు నమోదైంది.

అయితే, ఈ వివాదంపై నటి జోసెఫ్ స్పందిస్తూ.. ‘‘ఇందులో తప్పేముంది? బిడ్డకు పాలివ్వడమనేది తల్లికి బిడ్డకు ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది. మరింత ముఖ్యంగా అమ్మతనాన్ని చూపిస్తుంది. దీన్ని నగ్నత్వంగా భావిస్తే అంతకంటే సిగ్గుచేటు మరేదీ లేదు. ఇలాంటి ఫోజు ఇచ్చినందుకు నేను ఎంతో గర్వంగా ఫీలవ్వుతున్నా.’’ అని తెలిపింది.

అమ్మ, చెల్లి ఒప్పుకోలేదు, అయినా..: బిడ్డకు పాలిస్తూ తాను ఫొటోకు ఫోజిస్తున్నా అని మా అమ్మా, చెల్లికి చెప్పాను. ఇందుకు వారు అస్సలు ఒప్పుకోలేదు. అయితే, ఈ చిత్రం ద్వారా మహిళలు, అమ్మలు, భార్యలకు నేను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నా. మీ పిల్లలకు ధైర్యంగా పాలివ్వండి. అది ఓ అపూర్వ అవకాశం. సిగ్గుపడొద్దు’’ అని జోసెఫ్ తెలిపింది.

Image result for gilu joseph actress
మరింత సమాచారం మీకోసం .. !!

Related image

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article