శ్రీదేవి మృతిపై బోని బయటపెట్టిన నిజాలు

శ్రీదేవి చనిపోయి వారం పైనే అయ్యింది. అయినా శ్రీదేవి మన మధ్య లేదు అంటే ఇప్పటికి నమ్మశక్యం కావడం లేదు. బంధువుల పెళ్ళికని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి మరణం అభిమానులను షాక్ కు గురి చేసింది. అప్పటివరకు పెళ్ళిలో అందరితో కలిసి సందడి చేసిన సుందరి అకస్మాత్తుగా మరణించడం యావత్ సినిలోకాన్ని విషాదంలోకి నెట్టింది. అయితే, ఆమె మృతిపై వచ్చిన వార్తలు, సందేహాలు సంచలనం సృష్టించాయి. మొత్తంగా గుండెపోటు అన్నారు. ఆ తరువాత బాత్ టబ్ లో పడి మరణించిందన్నారు. అయితే శ్రీదేవి మరణంపై ఇప్పటికి కొందరికి అనుమానాలు ఉన్నాయి. అసలు ఎలా చనిపోయింది.. ఆ రోజు రాత్రి హోటల్ గదిలో ఏం జరిగింది. బాత్ టబ్ లో శ్రీదేవి ఎలా జారిపడింది..? అన్నది ఇప్పటికే సస్పెన్సే.

Image result for sridevi and boney kapoor photos

ఫిబ్రవరి 24, శనివారం శ్రీదేవి చనిపోయింది. అయితే, ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై బోనికపూర్ ఎట్టకేలకు నోరు విప్పారు. సర్ప్రైజ్ ఇవ్వడం నుంచి శ్రీదేవిని హాస్పిటల్ కి తీసుకెళ్లడం వరకు ఆ రెండు గంటల్లో ఏం జరిగిందో కోమల్ నాహ్తా అనే స్నేహితుడికి బోని కపూర్ చెప్పుకోగా.. అతను ఆ విషయాలన్నింటిని ట్విట్టర్ లో పెట్టాడు. ఫిబ్రవరి 20న బంధువుల పెళ్ళికి శ్రీదేవి దంపతులు హాజరయ్యారు. ఆ తర్వాత ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని బోని కపూర్ ఇండియా వచ్చేసాడు. అయితే, శ్రీదేవి మాత్రం జాన్వీ కోసం షాపింగ్ చేయాలనీ చెప్పేసి దుబాయ్ హోటల్ లోనే ఉండిపోయింది. బోని కపూర్ ఎప్పుడు శ్రీదేవిని వదిలి ఉండలేదు.. అందులోను ఎప్పుడు ఒంటరిగా విదేశాలకు పంపించలేదు. శ్రీదేవిని సర్ప్రైజ్ చేయడం అంటే బోనికి బలే ఇష్టం.

Related image

అటు హోటల్ లో అమ్మ ఒక్కరే ఉన్నారు.. భయపడుతుంది.. అంటూ బోని కపూర్ ను జాన్వీ కూడా ఫోర్స్ చేసింది. దీంతో వెంటన్ దుబాయ్ బయల్దేరి వెళ్లారు బోని కపూర్. ఫిబ్రవరి 24న దుబాయ్ వెళ్లి.. బోని కపూర్ సాయంత్రం ఆరున్నర సమయంలో శ్రీదేవి ఉంటున్న జుమైరా ఎస్టేట్స్ హోటల్ రూమ్ నెంబర్ 2201 కి వెళ్ళాడు. భర్త రాకతో సర్ప్రైజ్ అయిన శ్రీదేవి చాల ఆనందపడిపోయింది. 15నిముషాలు మాట్లాడుకున్న తరువాత డిన్నర్ కు వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. దీంతో శ్రీదేవి స్నానం కోసమని బాత్రూంకి వెళ్ళింది. బోని మాత్రం లివింగ్ రూమ్ లోకి వెళ్లి ఇండియా – సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూస్తూ ఉండిపోయాడు. అయితే పావు గంట గడిచిన ఆమె బయటకు రాకపోవడంతో ఆందోళనతో వెళ్లి చూసారు బోని కపూర్.

Related image

బాత్రూం డోర్ లాక్ చేసి ఉండకపోవడం ట్యాప్ సౌండ్ ఇంకా వినిపిస్తుడడంతో టెన్షన్ తో లోపలికి వెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైపోయిందని బోని కపూర్ తన ఫ్రెండ్ కి చెప్పారు. బాత్ టబ్ లో ఫుల్ గా నీళ్లు.. అందులో శ్రీదేవి పడిపోయి ఉంది. వెంటనే ఆమెను బయటకు తీసిన కదలిక లేకపోవడంతో.. కంగారులో ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఆ తరువాత హాస్పిటల్ కి తీసుకెళ్లానంటూ బోని కపూర్ తన స్నేహితుడు నాహ్తా కి చెప్పారు. బోని చెప్పిన ప్రతి విషయాన్నీ నాహ్తా తన ట్విట్టర్ లో చెప్పారు.

Related image

ఆ రోజు ఇది జరిగిందంటూ చెప్పుకొచ్చారు. భార్యను ఎంతో ప్రేమించే తన స్నేహితుడు బోని.. భవిష్యత్ లో ఎలా ఉంటారో అని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, బాత్ టబ్ లో శ్రీదేవి ఎలా పడింది స్పృహ కోల్పోయి బాత్ టబ్ లో పడ్డారా..? బాత్ టబ్ లోకి వెళ్ళాక స్పృహ కోల్పోయారు..? ఏం జరిగింది..? ఎంతో జాగ్రత్తగా ఉండే శ్రీదేవి బాత్ టబ్ లో పడి ఎలా చనిపోయిందన్న ప్రశ్నలకు మాత్రం ఇప్పటికి సమాధానం మాత్రం లేదు.

Related image

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article