రవితేజ సినిమాలో నీకు ఛాన్స్.. నా ఫ్లాట్ కి రా వివరాలు చెప్తా అని టీవీ నటిని పిలిపించాడు..!

దేశంలో నిర్భయ చట్టం అమల్లోకి తీసుకొచ్చినా మహిళలపై ఆగడాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలపై లైంగిక దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఓవైపు ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా కామాంధులుమాత్రం ఇవేమీ పట్టడం లేదు. చట్టాలు ఎంత పదునైనవయినా అవి అమలు జరగకపోతే వ్యర్థమే. కాగా, కాస్టింగ్ కౌచ్ అనే విష సంస్కృతి సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిందని చాలా మంది హీరోయిన్లు ఇటీవల బహిరంగంగానే వాపోయారు.

కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాదు చాలా చోట్ల జరుగుతున్న ఒక చీకటి వ్యవహారం. ఈ చీకటి దారిలో ప్రయాణించి అవకాశాలు దక్కించుకున్నవారు కొందరైతే, లైంగికంగా లొంగడం ఇష్టం లేక పరిశ్రమకు దూరంగా పారిపోయిన వారు కొందరు. సినిమాలో అవకాశం రావాలంటే తనతో పడుకోవాలని అడిగే దర్శకుల నుంచి నిర్మాతలు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. అచ్చం అలాంటి ఘటనే ఓ తెలుగు టీవీ నటికి ఎదురైంది. అది కూడా రవితేజ సినిమాలో అని పేరు చెప్పి..!

Image result

ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో నివాసముండే ఒక టీవీ నటికి ఫేస్ బుక్ ద్వారా జగదీశ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ మీకే అని చెప్పాడు. అది కూడా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో.. అయితే దాని గురించి చర్చించడానికి తన ఫ్లాట్ కు రావాలని ఆమెను పిలిచాడు.

Related image

ప్రగతినగర్లోని శ్రీ సాయిరామ్ మానర్ అపార్టుమెంట్‌ లోని 507 ఫ్లాట్‌ అడ్రస్ ఆమెకు ఇచ్చాడు. దీంతో అపార్టుమెంట్ కు వెళ్లిన ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టడంతో ఆమె ప్రతిఘటించింది. అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించగా ఇంటి తలుపులు వేసి.. ఆమెను బెల్టుతో ముఖం, వీపుపై కొట్టి బయటకు గెంటేశాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసును విచారిస్తూ ఉన్నారు.

Related image

సినిమాల్లో ఛాన్స్ లు ఇప్పిస్తామంటూ మోసం చేసే ఎంతో మందిని చూసే ఉంటారు. వారు చెబుతోంది అబద్దమే అయుండొచ్చు అని ఒక మూలన ఏదో ఒక డౌట్ ఉండే ఉంటుంది.. కానీ, అవకాశం ఇప్పిస్తామంటూ మోసం చేసే కొందరు కేటుగాళ్లు నిజంగానే ఉంటారని తాజా జరిగిన ఉదంతం ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article