తుప్పు పట్టిన ఈ కారు ఎన్ని కోట్లలో తెలుసా? ఎందుకో తెలుసా ?

కారు.. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక తప్పనిసరి అవసరం అవుతోంది. మొదటిసారి కారు కొనాలనుకునే వారు.. కొత్తదానికి బదులు ముందు పాత కారును కొన్ని రోజులు వాడుదాం అని ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు పాత కారు కొని సరిపెట్టుకుంటారు. కాగా, పాత కారు.. కొత్త జోరు. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌… ఆటోమొబైల్‌ రంగానికి అతికే మాట.

రోజుకో కొత్త మోడల్‌ మార్కెట్‌ని ముంచెత్తుతున్నా… కోరిన ఫీచర్లతో ధరలు అందుబాటులో ఉన్నా… జనం సెకండ్‌హ్యాండ్‌ కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, ఒక తుప్పు పట్టిన కారుకు మనం చాలావరకు వేలల్లో కొని మనకు కావాల్సిన విధంగా కొత్తగా తయారు చేసుకొంటాము. కాగా, 40 ఏళ్లుగా నిశ్చల స్థితిలో ఉంది ఆ కారు.. మొత్తం తుప్పు పట్టిపోయింది. లోపల చాలా వరకూ సరిగా లేదు. ఇలాంటి కారును తక్కువ రేటుకే దక్కించుకోవచ్చు అని అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. ఎందుకంటే..

ఆ కారు.. పోర్షే కంపెనీ కారు. దీని ధర ఇప్పుడు వేలంపాట వేస్తే భారత కరెన్సీలో 4,48,29,246 రూపాయలట.. దాదాపు నాలుగున్నర కోట్లకు పైనే దీన్ని అతి త్వరలో అమ్మబోతున్నారు. 1955 మోడల్ కు చెందిన పోర్షే కారు ఇది. ఈ కారును 1970లలో బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని నడపలేదట. 52837 మైళ్ళు ఈ కారు ఇప్పటిదాకా తిరిగింది. ఈ కారును ఫ్లోరిడాలో త్వరలో వేలం వేయనున్నారు. 1950లలో తయారు చేసిన ఈ కారు అప్పటి అవసరాలకు అనుగుణంగా తయారు చేసిన స్పోర్ట్స్ కార్ అట..!

కారు ఇంజన్ ను మార్చాల్సి ఉంటుందని పోర్షేలో పని చేసే వారు అంటున్నారు. వేలంపాటలో నాలుగున్నర కోట్ల బేస్ ప్రైస్ ను దాటి ఎవరు కొంటారా అని పోర్షే ప్రతినిధులు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. అమెరికా లోని ఓ కార్ పోర్ట్ లో దీన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టారు.

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article