ఉదయం పెళ్ళై.. సాయంత్రం కల్లా తల్లైన పెళ్లికూతురు..పెళ్ళికొడుకు రియాక్షన్ తెలిస్తే షాక్ అవుతారు

ప్రస్తుత కాలంలో యువతీయువకులు ప్రేమించుకోవడం.. పెళ్లి కాకుండానే.. తొందపడి బిడ్డకు జన్మనివ్వడం మాములు విషయమే. అయితే, ఇదంతా జరిగిన తరువాత కూడా వాళ్లకు ఇష్టమైతే.. వాళ్ళు పెళ్లి చేసుకోవడమో.. లేకపోతే విడిపోవడమో జరుగుతుంది. ఇదిలా ఉండగా.. అక్కడ మాత్రం పెళ్ళైన సాయంత్రానికే పెళ్లికూతురు తల్లి అయ్యింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే..

ఈ విచిత్ర ఘటన త్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలో ఉన్న జ‌ర్గావ్ గ్రామంలో జరిగింది. ఒకే గ్రామానికి చెందిన వారిద్దరికి ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన‌ పెళ్లి చేసుకున్నారు. కొన్ని జరగాల్సిన కార్యక్రమాలు ఉండడంతో వధూవరులు ఇద్దరు ప‌క్క‌నే ఉన్న స‌ఖం ముస‌ల్మ‌న‌న్ అనే గ్రామంలోని ఓ ఇంటికి వెళ్లారు. అయితే అంత‌లోనే వ‌ధువుకి క‌డుపులో తీవ్ర‌మైన నొప్పి వ‌చ్చింది. దీంతో ఆమెను హాస్పిట‌ల్‌లో చేర్పించ‌గా.. ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. పెళ్లి కొడుకు ఆ బిడ్డను చూసుకుంటూ తెగ మురిసిపోయాడు. ఉదయం పెళ్లి అయ్యింది.. సాయంత్రం ఇలా పెళ్లి కొడుకు తండ్రి అయ్యాడు.. అందులో పెళ్లి కొడుకు తెగ ఆనందపడిపోతున్నాడని ఆశ్చర్యపోవడం మిగతావారి వంతైందట.

కానీ, అసలు కథ ఏంటంటే.. పెద్దలే పెళ్లి కుదిర్చారు. వీళ్లిద్ధరికి రెండేళ్ల కిందటే నిశ్చిర్థార్తం అయ్యింది. కాని అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. పెళ్లి వాయిదా పడ్డా.. అబ్బాయి, అమ్మాయి మాత్రం సమయం చిక్కినప్పుడల్లా పర్సనల్ గా కలిసేవారు. ఇక ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాళ్లమే కదా అని అప్పుడప్పుడు ఇద్దరూ శారీరకంగా కలిశారు.

Image result for Unnao

దీంతో అమ్మాయి గర్భం దాల్చింది. తనకు కాబోయే భార్య గర్భం దాల్చిన విషయం ఆ పెళ్లి కొడుకుకు కూడా తెలుసు. అప్పుడప్పుడు టెస్ట్ లు చేయించేవాడట. తనని జాగ్రత్తగా ఉండు అని ఫోన్ లో సలహాలు కూడా ఇచ్చేవాడంట. ఇక బంధువులు చివరకు అసలు విషయం తెలుసుకుని ఆ పెళ్లితో పాటు బిడ్డను ఊయలలో వేసే కార్యక్రమాలున్నాయంటే ఇంకో రెండు రోజులు సెలవులు పెట్టుకుని వచ్చే వాళ్లం కదా అని అనుకున్నారంట.

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article