కాస్టింగ్ కౌచ్ పై ఇలియానా సంచలన వ్యాఖ్య

సినీ పరిశ్రమపై తన హాట్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలిచే ఇలియానా.. తాజాగా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల అంశంపై స్పందించింది. అవి పరిశ్రమలో సర్వసాధారణమే అని అంటోంది ఇలియానా. అయితే, తన వ్యక్తిగత అనుభవాలను చెప్పలేదు కానీ.. ఒక సీనియర్ నిర్మాత వేధిస్తున్నాడు అని అంటూ.. ఒక జూనియర్ ఆర్టిస్టు తన వద్దకు వచ్చి చెప్పుకుందని.. ఏం చేయమంటారు? అని తన సలహా కోరిందని ఇలియానా చెప్పుకొచ్చింది.

Related image

దానికి ఇలియానా స్పందిస్తూ.. నేను చెప్పేదేం లేదు.. నువ్వే నిర్ణయించుకో.. అని తను సమాధానం ఇచ్చానని చెప్పిందట. ఇలాంటి లైంగిక వేధింపులు ఇండస్ట్రీలో సహజమే అని.. అయితే ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న అమ్మాయిలు నోరు విప్పలేరని కూడా ఇలియానా చెప్పుకొచ్చింది. వాటిపై స్పందిస్తే.. అక్కడితో కెరీర్ క్లోజ్ అయిపోతుందని చాలా మంది భయపడతారు.

Image result for ileana d cruz

అందుకే ఈ తరహా వ్యవహారాలు బయటకు రావు అని ఓపెన్ గా చెప్పేసింది ఈ గోవా బ్యూటీ. అలాగని ఇండస్ట్రీలో అమ్మాయిలపై ఇలాంటి వేధింపులను తను సమర్థించడం లేదని, వాటి విషయంలో ఎలా స్పందించాలో హీరోయిన్లే ఎవరికి వారు నిర్ణయించుకుంటారని ఇలియానా అభిప్రాయపడింది.

Related image

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article