స్టార్ హీరోయిన్ పై కేసు.. అసలేమైందంటే..

తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ స్టార్ హన్సికపై కేసు నమోదయింది. ప్రస్తుతం దీని గురించే కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అసలేమైందంటే.. తమిళ నటీనటుల మండలిలో హన్సికపై ఆమె మేనేజర్ మునుస్వామి చీటింగ్ కేసు నమోదు చేయడంతో అసలు విషయం బయటకు రావడంతో కోలీవుడ్ లో చర్చనీయంశంగా మారింది. అయితే, ప్రస్తుతం హన్సికకు సంబంధించిన డేట్స్, పారితోషికం వంటి విషయాలను స్వయంగా ఆమె తల్లే దగ్గరుండి చూసుకుంటుంది.

Image result for hansika

అయితే అంతకు ముందు వరకు మునుస్వామి వీటన్నింటిని చూసేవారు. ఆయన్ని మేనేజర్‌గా తీసేసిన తర్వాత తనకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తాన్ని ఇవ్వకుండా.. హన్సిక, ఆమె తల్లి ఇబ్బంది పెడుతున్నారని.. అన్ని ఆధారాలతోనే తాను నడిగర్ సంఘంలో ఫిర్యాదు నమోదు చేసినట్లుగా ఆయన చెప్తున్నాడు. ఇదిలా ఉంటే.. మునుస్వామితో డైరెక్ట్‌గా హన్సిక ఫోన్‌లో మాట్లాడారని, తనకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తానని, కేసును వాపస్ తీసుకోవాలని హన్సిక కోరినట్లుగా తాజాగా కోలీవుడ్‌లో టాక్ నడుస్తుంది.

Image result for hansika

హన్సిక ప్రస్తుతం.. ‘తుపాకి మున్నై’ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. విక్రమ్ ప్రభు హీరోగా ఈ చిత్రం తెర‌కెక్కుతుతోంది. దీంతో పాటు సామ్ ఆంట‌న్ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమాలోనూ నటిస్తోంది. అయితే, తమ అభిమాని నటిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు.

Related image

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article