తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ‘మా నాన్న సూపర్ హీరో’

Pakka Telugu Rating : 2.75/5
Cast : సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్ తదితరులు
Director : అభిలాష్ కంకర
Music Director : జైకృష్ణ
Release Date : 10/10/2024

చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో సుధీర్ బాబు. అందుకు భిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవల ‘హరోం హర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తాజాగా అభిలాష్ కంకర దర్శకత్వంలో ‘మా నాన్న సూపర్ హీరో’తో ఇవాళ ప్రేక్షకుల ముందు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రివ్యూలో చూద్దాం.

కథ

ప్రకాష్ (సాయి చంద్) ఓ లారీ డ్రైవర్. అతని భార్య ఓ బిడ్డకు జన్మించి కన్నుమూస్తోంది. లారీ డ్రైవర్ కాబట్టి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో చంటి పిల్లాడైన తన బిడ్డను అనాథాశ్రమంలో ఉంచి వెళుతుంటాడు. ఈ క్రమంలో అతని లారీలో అతనికి తెలియకుండా గంజాయ్ స్మిగ్లింగ్ జరగుతుంది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. సాక్ష్యాలు కూడా అతనికి వ్యతిరేకంగా ఉండటంతో కోర్టు దోషిగా నిర్ధారించి 20 ఏళ్ల యావజ్జీవ శిక్ష విధిస్తుంది. దీంతో అతని పిల్లగాడు అనాథశ్రమంలో జాని (సుధీర్ బాబు) పెరిగి పెద్దవాడు అవుతాడు. ఆ తర్వాత అతన్ని శ్రీనివాస్ అనే స్టాక్ బ్రోకర్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. అతను శ్రీనివాస్ ఫ్యామిలీలో అడుగుపెట్టినప్పటి నుంచి వాళ్ల కుటుంబంలో అనుకోని సంఘటనలతో దివాళా తీస్తాడు. దీంతో పెంపుడు కొడుకుపై కోపం పెంచుకుంటాడు. కానీ జానీకి మాత్రం తనను పెంచి పెద్ద చేసిన తండ్రి అంటే చచ్చేంత ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలో శ్రీనివాస్ ఓ పొలిటికల్ లీడర్ కు దాదాపు రూ. కోటి బాకీ పడతాడు. ఆ బాకీ తీర్చడానికి జానీ ఏం చేసాడు. ఈ క్రమంలో అతని అసలు తండ్రి ప్రకాష్ జైలు నుండి విడుదలవుతాడు.ఈ క్రమంలో జానీ, తన కన్నతండ్రిని కలుసుకున్నాడా.. మరోవైపు పెంపుడు తండ్రి బాకీని జానీ ఎలా తీర్చాడనేదే ఈ సినిమా కథ.

కథనం, విశ్లేషణ

తమిళ, మలయాళంలో కొన్ని సినిమాలు చూసినప్పుడు.. మన దగ్గర ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ రావట్లేదే అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోరిక తీర్చడానికి అన్నట్లు వచ్చిన మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఓ నవల చదివిన ఫీలింగ్ కలుగుతుంది. మూవీ మొదలైన దగ్గర నుండే దర్శకుడు.. ఒక గిరి గీసుకుని, కథని మాత్రమే చెప్పే ప్రయత్నం చేశాడు. నాన్నపై కొడుకుకి ఉన్న ప్రేమని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఆ ఎమోషన్ ఎస్టాబ్లిష్ అయ్యాకనే.. మెయిన్ కాంఫ్లిక్ట్ పాయింట్ టచ్ చేశాడు. కాకపోతే.. ఇదే సమయంలో ప్యారెలెల్ గా సాయి చంద్ క్యారెక్టర్ ని నడిపి.. ఓ మంచి ఎమోషనల్ జర్నీకి కావాల్సిన ట్రాక్ అంతా సెట్ చేసేసుకున్నాడు. ఇక హీరో పాత్రని ఓ సంఘర్షణలోకి నెట్టి.. తరువాత ఏమి చేయబోతున్నాడా అనే సస్పెన్స్ వద్ద ఇంటర్వెల్ బ్లాక్ సెట్ చేసుకోవడం కూడా బాగుంది. ఇక సెకండ్ ఆఫ్ అంతా సుధీర్ బాబు, సాయి చంద్ చుట్టూ తిరుగుతుంది. సింపుల్ అండ్ ఎఫెక్టీవ్ సీన్స్‌తో సెకండ్ ఆఫ్ ఎమోషనల్ జర్నీలా సాగిపోతుంది. కాకపోతే.. ఇక్కడ కథ, కథనాల కన్నా.. సుధీర్ బాబు, సాయి చంద్ యాక్టింగ్ హైలెట్ గా నిలిచాయి. ఇక.. నమ్మిన స్నేహితుడిని మోసం చేయలేక, అలా అని.. పెంచిన తండ్రిని ఆపదలో వదిలేయలేక హీరో క్యారెక్టర్ మధనపడిపోయిన విధానం చాలా బాగుంది. కాకపోతే సినిమా చాలా స్లోగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలైతే అనవసరంగా పెట్టారన్న ఫీల్ కలుగుతుంది.

నటీనటులు

సుధీర్ బాబు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. పెంపుడు తండ్రి కోసం ఏమైనా చేసే కొడుకు పాత్రలో ఒదిగిపోయారు. మరోసారి తన మార్క్ యాక్టింగ్ మెప్పించారు. ఇక పెంపుడు తండ్రి పాత్రలో నటించిన షాయాజీ షిండే మరోసారి తన పాత్రలో ఒదిగిపోయారు. ఇక కన్న తండ్రి పాత్రలో నటించిన సాయిచంద్ నటన మెచ్చుకోవాల్సిందే. ఫిదా తర్వాత మంచి రోల్ దక్కిందని చెప్పాలి. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక వర్గం

మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాకు దర్శకుడు కథకు తగ్గ పాత్రధారుల్ని ఎంచుకున్నాడు. అయితే కథనంలో కాస్తా ల్యాగ్ అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కమర్షియల్ కథలంటూ సాగుతున్న నేపథ్యంలో దర్శకుడు చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇక సంగీతం, ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

  • సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్ నటన
  • కొన్ని భావోద్వేగ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్

  • సాగదీత సన్నివేశాలు
  • క్లైమాక్స్

పంచ్ లైన్: ‘మా నాన్న సూపర్ హీరో’.. ఎక్కడో కాస్త.. ఎమోషన్ మిస్సైనట్లుంది!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button