తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ‘శివం భజే’

Pakka Telugu Rating : 2.75
Cast : అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి తదితరులు
Director : అప్సర్
Music Director : వికాస్ బడిస
Release Date : 01/08/2024

అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా తెరకెక్కిన సినిమా ‘శివం భజే’. గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో అప్సర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ‘శివం భజే’ సినిమా నేడు ఆగస్టు 1న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. ‘హిడింబ‌’ త‌ర్వాత అతడు న‌టించిన చిత్ర‌మిది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం!

కథ

చందు (అశ్విన్ బాబు) బ్యాంక్ లోన్స్ రికవరీ ఏజెంట్. తండ్రి బాల్యంలోనే మరణించడంతో తల్లి (తులసి) చాటున పెరిగిన అతడికి చిన్నతనం నుంచే శివ భగవానుడంటే కోపం. శైలజా (దిగంగన సూర్యవంశీ) అనే ఫార్మాసిస్టుతో ప్రేమలో పడి లైఫ్‌ను జాలీగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో లోన్ రికవరీ చేసే క్రమంలో ఓ ముఠాతో గొడవ కారణంగా జరిగిన ఫైట్‌లో చందు చూపు కోల్పోతాడు. ‘పవన్ కల్యాణ్ ఎవ్వరినీ వదలడు.. ఆ విషయంలో 200 శాతం నమ్మకం’ బాల్యంలో తండ్రి ఎలా చనిపోయాడు? చిన్నతనం నుంచే ఎందుకు శివుడిపై అయిష్టతను పెంచుకొన్నాడు? రౌడీలతో జరిగిన కొట్లాటలో చూపు ఎలా కోల్పోయాడు? చూపు కోల్పోయిన తర్వాత కంటి సర్జరీ తర్వాత అతడి జీవితాన్ని గందరగోళంలో పడేసి మలుపు తిప్పిన సంఘటన ఏమిటి? తెలంగాణ పోలీస్ విభాగంలో డోగ్రా అనే శునకానికి చందు లైఫ్‌కు ముడిపెట్టిన విషయం ఏమిటి? భారత్‌ దురక్రమణకు చైనా, పాకిస్థాన్‌ చేసిన కుట్ర ఏమిటి? దేశ భద్రతకు భంగం కలిగించే విషయంలో ఏసీపీ మురళీ (అర్బాజ్ ఖాన్) పాత్ర ఏమిటి? చైనా, పాక్ కుట్రను చందు ఎలా ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథనం-విశ్లేషణ

ఇటీవల థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. శివం భజే సినిమా థ్రిల్లర్ అయినా చాలా కొత్త పాయింట్ తో తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ హీరో, హీరోయిన్ ప్రేమ, హీరో గురించి సాగుతూ సింపుల్ గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు హీరోకి కుక్క కళ్ళు అమర్చారు అని రివీల్ చేసి నెక్స్ట్ ఏంటి? ఏ కుక్క? శివుడుకు చందుకు లింక్ ఏంటి అని ఆసక్తి కలుగుతుంది. సెకండ్ హాఫ్ ఆ కుక్క గురించి, పోలీస్ ఇన్వెస్టిగేషన్, హీరోకి కుక్క జ్ఞాపకాలు రావడం, శివుడు విజువల్స్.. ఇలా చాలా ఆసక్తిగా సాగుతుంది. స్క్రీన్ ప్లేని చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొదట్లో కొంచెం బోర్ కొట్టినా ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా ఆసక్తిగా మారుతుంది.

హీరో క్యారెక్టరైజేషన్ బాగా రాసుకున్నాడు డైరెక్టర్. మొదట్నుంచి కుక్కలు అంటే ఇష్టం లేని హీరోకి కుక్క కళ్ళు అమర్చడంతో పాటు సెకండ్ హాఫ్ లో కుక్కలతో వచ్చే సీన్స్ అన్ని అదిరిపోతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. క్లైమాక్స్ లో చూపించే శివుడి విజువల్స్ కోసం అయినా ఈ సినిమాని థియేటర్లో చూడాలి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ప్రశ్నలు అన్నిటికి సెకండ్ హాఫ్ లో సమాధానాలు ఒక్కొక్కటిగా రివీల్ చేసి ఆసక్తిగా తెరకెక్కించారు.

నటీనటులు

అశ్విన్ బాబు ఇప్పటికే థ్రిల్లర్ సినిమాల్లో అదరగొట్టాడు. మొదట్నుంచి డిఫరెంట్ కథలతో ప్రేక్షకులని మెప్పిస్తున్న అశ్విన్ బాబు ఈ సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. క్లైమాక్స్ ఫైట్ లో అయితే అశ్విన్ నటన ఓ రేంజ్ లో ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పిస్తాడు. ఇక హీరోయిన్ దిగంగన సూర్యవంశీ కేవలం కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. పోలీసాఫీసర్ గా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ బాగానే మెప్పించాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో ఆది నవ్విస్తాడు. ఇనయా సుల్తానా, తులసి, మురళి శర్మ, బ్రహ్మాజీ.. ఇలా మిగిలిన నటీనటులు తమ పాత్రల్లో మెప్పించారు. అలాగే డోగ్రె కుక్క, మరికొన్ని కుక్కలు కూడా బాగా నటించాయి.

సాంకేతిక వర్గం

ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్ ప్రతి సీన్ ప్రేక్షకులని మెప్పించేలా దర్శకుడు బాగా రాసుకున్నాడు. ఇక శివుడి విజువల్స్ బాగా చూపించాడు. డైరెక్టర్ అప్సర్ ముస్లిం అయినా కథలో శివుడి తత్వాన్ని, శివుడి విజువల్స్ ని అద్భుతంగా చూపించారు. ఇందుకు డైరెక్టర్ ని మెచ్చుకోవచ్చు. దర్శకుడిగా అప్సర్ అదరగొట్టాడని చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పాటలు యావరేజ్ అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగుంటాయి. ఎడిటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కథలో ఎక్కడా బోర్ కొట్టకుండా చేసారు. నిర్మాణ పరంగా కూడా శివం భజే సినిమాకి బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

అశ్విన్ బాబు నటన

క్లైమాక్స్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్

థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం

పంచ్ లైన్: వినూత్న ప్రయత్నం.. భారం శివుని పైనే

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button