తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ఉపేంద్ర ‘యూఐ’

Pakka Telugu Rating : 2.5/5
Cast : ఉపేంద్ర, రీష్మ, మురళీశర్మ, రవిశంకర్, అచ్యుత్, సాధు కోకిల
Director : ఉపేంద్ర
Music Director : అజనిశ్ లోక్‌నాథ్
Release Date : 20/12/2024

కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన స్వీయ దర్శకత్వం వహించిన రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయో లేదో ఇప్పటికీ తెలీదు. అయినా ఆయన సినిమాలో ఏదో ఉంటుందని మాత్రం ప్రేక్షకులు గట్టిగా నమ్ముతారు. ఉపేంద్ర స్వీయదర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘యూఐ’. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు ఓ పదేళ్ల తర్వాత ఉపేంద్ర మళ్లీ మెగా ఫోన్ పట్టాడంటే కచ్చితంగా తన సినిమా ద్వారా ఏదో కొత్త ప్రపంచాన్ని చూపిస్తారని అంతా అనుకున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో సైతం ఈ మూవీ ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం!

కథ

ఉపేంద్ర దర్శకత్వం వహించిన ‘యూఐ’ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే తెరపైనే చూడాలి.

కథనం, విశ్లేషణ

ఆడియెన్స్‌ని కన్ఫ్యూజ్ చేయడం, అసలేం జరుగుతుందో ఎక్స్‌పెక్ట్ చేయకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లడం, డిఫరెంట్ టేకింగ్, అంతే డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉపేంద్ర స్టైల్ ఆఫ్ మేకింగ్. ‘యూఐ’ మూవీ కూడా అదే పంథాలో సాగుతుంది. ‘మీరు ఇంటిలిజెంట్ అనుకుంటే.. వెంటనే థియేటర్ నుండి బయటకి వెళ్లండి.. మూర్ఖుడైతే సినిమా మొత్తం చూడండి’ అంటూ మొదట్లోనే ప్రేక్షకులకు సవాల్‌ విసరడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘పగలు, రాత్రి’ సత్య (ఉపేంద్ర) వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ సాగుతుంది. 2040లో ప్రపంచం ఎలా ఉంటుందన్న విషయాలను ఉపేంద్ర ఇందులో సెటైరికల్ విధానంలో చూపించారు. రియల్ టైమ్ ప్రాబ్లమ్స్‌తో, హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇక తనదైన టేకింగ్‌తో మళ్లీ పాత ఉపేంద్రను గుర్తు చేశారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే సైకో లవ్ ట్రాక్ వింటేజ్ ఉపేంద్రను గుర్తు చేస్తుంది. ‘యూఐ’ చూస్తున్నంతసేపు అబ్బురపరిచే విజువల్స్, డిఫరెంట్ యాక్టింగ్, వింత వింత గెటప్స్.. ఇలా కొందరికి నచ్చే బోలెడన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ కొందరికేమో ఏం జరుగుతుందో అస్సలు అర్థంకాదు. సత్య పాత్ర, ప్రపంచంలోని అన్ని మతాల వాళ్లు ఒకేచోట ఉండటం, దేవుడిని నమ్మకపోవడం.. ఇలా విచిత్రమైన సీన్స్ వస్తుంటాయి. మధ్యమధ్యలో జనాలు ప్రస్తుతం చేస్తున్న కొన్ని పనుల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయోనని మెసేజులు ఇస్తూ పోతుంటారు. భూమిని మనుషులు దోచుకోవడం.. జాతి, ధర్మం పేరు చెప్పి మనుషులతో నాయకులు చేసే రాజకీయం.. ఇలా ఒకటేమిటి చాలానే వస్తుంటాయి. అక్కడక్కడ కాస్త నవ్వు తెప్పించే సీన్స్ ఉన్నప్పటికీ.. ప్రారంభంలోనే చెప్పినట్లు చాలా ఓపిగ్గా చూస్తే తప్పితే ఈ మూవీ అర్థం కాదు. ప్రయోగాత్మక చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రమే ఇది నచ్చుతుంది. ఇక, ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా మనం అనుకున్న టైమ్‌కి రావు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఊహించడం కష్టం.

నటీనటులు

ఉపేంద్ర యాక్టింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కేవ అనిపిస్తుంది. ఆయన ఎలా నటించినా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలోనూ అంతే అద్భుతంగా నటించారు. కానీ హీరోయిన్ పాత్ర అసలెందుకో అర్థం కాదు. కేవలం మూడు నాలుగు సీన్లు మాత్రమే హీరోయిన్‌కి ఉంటాయంతే. మురళీశర్మ, రవిశంకర్, అచ్యుత్, సాధు కోకిల వంటి నటీనటులు పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం

డైరెక్టర్‌గా, యాక్టర్‌గా ఉపేంద్ర వన్ మ్యాన్ షో చేశారు. రియల్ టైమ్ ప్రాబ్లమ్స్‌తో, హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్‌తో ఉపేంద్ర ‘యూఐ’ని తెరకెక్కించారు. పైగా దానిని సైకలాజికల్ కాన్సెప్ట్‌తో ముడి పెట్టారు. కానీ ఈ కాన్సెప్ట్ ప్రేక్షకుడి ఎంత మేరకు అర్థమవుతుందన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎప్పుడూ చూడని ఓ వింత ప్రపంచాన్ని ఈ సినిమాలో చూపించారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మేకింగ్ వాల్యూస్ సూపర్. బీజీఎం పరవాలేదు.

ప్లస్ పాయింట్స్

  • కొత్త కాన్సెప్ట్, విజువల్స్

మైనస్ పాయింట్స్

  • అర్థం కాని స్టోరీ

పంచ్ లైన్: ‘యూఐ’ ఏమీ చెప్పలేని.. ఒక వింత అనుభూతి!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button