తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: వరుణ్ తేజ్ ‘మట్కా’

Pakka Telugu Rating : 2.75/5
Cast : వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర, సత్యం రాజేశ్, సలోని తదితరులు
Director : కరుణ కుమార్
Music Director : జీవీ ప్రకాశ్ కుమార్
Release Date : 14/11/2024

ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ కంటెంట్ ఉన్న సినిమాలు సెలక్ట్ చేసుకుంటూ వస్తున్న హీరో వరుణ్ తేజ్. అయితే ‘గద్దలకొండ గణేశ్’ తర్వాత ఆయనకు ఒక్క హిట్ కూడా పడలేదు. ‘గని’, ‘గాంఢీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఇలా అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక తాజాగా ‘పలాస 1978’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేసిన సినిమా ‘మట్కా’. టీజర్ దగ్గర్నుంచే అంచనాలు పెంచేసిన ఈ మూవీ ప్రేక్షకుల ఎంతమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ

1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్ స్టర్ కథ ఇది. వాసు (వరుణ్ తేజ్).. బర్మా నుంచి బతుకు తెరువు కోసం విశాఖపట్నానికి వచ్చిన ఓ సాధారణ కూలీ. మట్కా గ్యాంబ్లింగ్‌లో చేయి తిరగడంతో గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. అయితే కొన్నాళ్లకే వాసు.. మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో తనకు ఎదురైన అడ్డంకులను ఎలా ఎదుర్కొన్నాడు? సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఎలా సాగింది? అన్నది ఈ మూవీ కథ.

కథనం, విశ్లేషణ

‘మట్కా’ పేరు చెప్పగానే చాలా మందికి గుర్తుకు వచ్చే పేరు రతన్ కత్రీ. పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చిన రతన్ కత్రీ.. మట్కా కింగ్‌గా ఎదిగాడు. మట్కాని లీగల్ చేస్తే, ఇండియాకి ఉన్న అప్పులన్నీ తీర్చేస్తానని కేంద్ర ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చిన గ్యాంగ్ స్టర్ రతన్ కత్రీ. అయితే ఇదే పాయింట్‌ని తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్చి, విశాఖపట్నం బ్యాక్ గ్రాప్‌లో తెరకెక్కించాడు డైరెక్టర్ కరుణ కుమార్.
పీరియాడిక్ సెటప్ బాగుంది. అయితే కథలో కొత్తదనం లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినప్పటికీ కేజీఎఫ్, పుష్ప వంటి పీరియాడిక్ క్రైమ్ డ్రామాల ప్రభావం కనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే, సన్నివేశాలు ఆడియన్స్‌ని పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో చాలా సీన్లు బోర్ కొట్టిస్తాయి. కొన్ని సీన్లయితే రియాల్టీకి దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. ‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కరుణ కుమార్.. మాస్ ఎలిమెంట్స్‌తో ‘మట్కా’ తీసి తాను కమర్షియల్ సినిమా కూడా తీయగలనని నిరూపించుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ కథను తెరపై సరిగా చూపించలేకపోయారు.

నటీనటులు

నటుడిగా వరుణ్ తేజ్‌ని ఓ మెట్టు ఎక్కించిన సినిమాగా ‘మట్కా’ నిలుస్తుందని చెప్పాలి. మట్కా వాసు క్యారెక్టర్‌లో వరుణ్ తేజ్ చూపించిన వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. వరుణ్ లుక్స్, హెయిర్ స్టైల్, వాకింగ్ స్టైల్ ఇలా ప్రతీ చిన్న విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరికి ‘లక్కీ భాస్కర్’ మూవీ లాగా మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. నోరా ఫతేహి తన గ్లామర్‌తో మ్యాజిక్ చేసింది. ‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోనితో పాటు సత్యం రాజేశ్, నవీన్ చంద్ర పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం

నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. విజువల్స్ బాగున్నాయి. డైరెక్టర్ కరుణ కుమార్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అలాగే ఎడిటింగ్‌కి కూడా ఇంకాస్త పని చెప్పాల్సింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఫర్వాలేదు. యాక్షన్ సీన్స్ అద్భుతంగా చిత్రీకరించారు. పీరియాడిక్ సెటప్ బాగుంది. సెట్స్, ఆర్ట్ వర్క్ అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

  • వరుణ్ తేజ్ నటన
  • యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్

  • రొటీన్ స్టోరీ
  • స్క్రీన్ ప్లే

పంచ్ లైన్: ‘మట్కా’.. కొంచెం అటు.. ఇటుగా!

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button