Atlee: డైరెక్టర్‌ను షోకి పిలిచి అవమానించిన బాలీవుడ్ కమెడియన్‌కు దిమ్మతిరిగే రిప్లై..!
బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ తన నోటిదూలను మరోసారి బయటపెట్టుకున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీని తన షోకి పిలిచి మరి అవమానించారు. అయితే ఆ డైరెక్టర్ ఇచ్చిన రిప్లైతో కపిల్‌కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లో సూపర్ హిట్ కొట్టిన అట్లీ.. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా ‘బేబీ జాన్’ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నారు.
టాలెంట్ ఉంటే చాలు!
అయితే ఈ షోలో అట్లీ లుక్‌పై కపిల్ విమర్శలు చేశారు. ‘కథ చెప్పడం కోసం ఎవరినైనా స్టార్ హీరోను మీరు కలిసినప్పుడు.. వాళ్లు అట్లీ ఎక్కడ అని అడుగుతారా?’ అని కపిల్ ప్రశ్నించాడు. అతడి మాటల్లోని అర్థాన్ని అర్థం చేసుకున్న అట్లీ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మీరెందుకు ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారో నాకు అర్థమైంది. మీ ప్రశ్నకు నా సమాధానం ఒక్కటే.. టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది పెద్ద విషయం కాదు. నిజం చెప్పాలంటే, దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కు నేను కృతజ్ఞతలు చెప్పాలి. తొలిసారి ఒక కథతో ఆయన వద్దకు వెళ్లినప్పుడు.. ఆయన కేవలం నా స్క్రిప్ట్ గురించే ఆలోచించారు తప్ప నా లుక్ ఎలా ఉందనేది చూడలేదు. నా కథపై నమ్మకం ఉంచి నా తొలి చిత్రానికి నిర్మాతగా చేశారు. కాబట్టి, ప్రపంచం కూడా మన వర్క్‌నే చూడాలి. రూపాన్ని బట్టి మనల్ని అంచనా వేయకూడదు’ అని అట్లీ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. కపిల్ తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు. షోకు ఆహ్వానించి ఈవిధంగా అవమానించడం ఏమీ బాలేదని మండిపడుతున్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.