తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Deepika: తల్లైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తల్లయ్యారు. ఇవాళ ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఈ శుభవార్తతో ఆమె కుటుంబంలో ఆనందం నెలకొంది. దీపిక – రణ్‌వీర్‌ సింగ్‌ దంపతులకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్ లీలా’ చిత్రంలో తొలిసారి దీపికా – రణ్‌వీర్‌ కలిసి నటించారు. ఈ షూటింగ్‌ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నారు.

Leave a Reply

Back to top button