తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Rashmika: ఆ తర్వాత రిటైర్ అయిపోయినా ఫర్వాలేదు: రష్మిక

‘పుష్ప-2’ బ్లాక్ బస్టర్‌తో నేషనల్ క్రష్ రష్మిక పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ జీవిత్ర చరిత్ర ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో ప్రస్తుతం రష్మిక నటిస్తున్నారు. విక్కీ కౌశల్ శంభాజీ పాత్రలో నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ సందర్భంగా రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హ్యాపీగా రిటైర్ అవగలను!

‘ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఒక నటిగా నాకు ఇంతకు మించి ఏం కావాలి. ఈ సినిమా తర్వాత నేను సంతోషంగా రిటైర్ అవ్వగలను అని దర్శకుడితో ఒక సందర్భంలో చెప్పాను. అంత గొప్ప పాత్ర ఇది. దీని షూటింగ్‌ సమయంలో ఎన్నో సార్లు భావోద్వేగానికి గురయ్యా. ట్రైలర్‌ చూశాక కూడా ఎమోషనల్‌ అయ్యా.’ అని రష్మిక చెప్పారు. మరోవైపు ట్రైలర్ ఈవెంట్లో రష్మిక కాలికి గాయంతో కుంటుతూ నడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button