తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Saif Alikhan: అర్ధరాత్రి సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నం.. ఆరు చోట్ల కత్తిపోట్లు!

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై అర్ధరాత్రి హత్యాయత్నం జరగడం ప్రకంపనలు రేపుతోంది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ముంబైలోని ఆయన నివాసంలో ఈ దాడి జరిగింది. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. సైఫ్ ఆ దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్‌కు మొత్తం ఆరు చోట్ల కత్తిపోటు గాయాలయ్యాయి. . ప్రస్తుతం సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

2 చోట్ల లోతైన గాయాలు!

సైఫ్‌కి మొత్తం ఆరు చోట్లు కత్తిపోట్లు దిగాయని, అందులో రెండు చాలా లోతుగా దిగాయని లీలావతి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోటు చేసుకున్న ఉదంతం పట్ల సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు ముంబై జోన్ 9 డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఆ ఆగంతకుడి కోసం స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని అన్నారు. మరోవైపు, ఘటనపై సైఫ్ టీం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘సైఫ్‌ అలీ ఖాన్‌ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ప్రస్తుతం నటుడికి ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. ఈ విషయంపై అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నాం.’ అని పేర్కొంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button