తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Saif: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. పశ్చిమ బెంగాల్‌‌లో మరో అరెస్ట్..!

బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో రోజుకో మలుపు చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే బంగ్లాదేశ్ జాతీయుడు షరీఫుల్ ఇస్లాంను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిందితుడి వేలిముద్రలను పోలీసులు సేకరించారు. అయితే, దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్‌ ప్రింట్స్‌ నిందితుడితో సరిపోలకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఇక, ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు పశ్చిమ బెంగాల్‌లో మరో అరెస్ట్ చేశారు. నిందితుడు షరీఫుల్ ఇస్లాం ఉపయోగించిన సిమ్‌ సదరు మహిళ పేరుపై ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో బెంగాల్‌లోని నదియా జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహించి, సదరు మహిళను అరెస్ట్ చేశారు.

సైఫ్‌ రక్త నమూనాల సేకరణ

మరోవైపు కేసు విచారణ కోసం ముంబై పోలీసులు సైఫ్‌ రక్త నమూనాలను, దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్‌ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని.. అయితే, పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే దాడి సమయంలో సైఫ్‌ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో అవి సైఫ్‌ అలీఖాన్‌వేనా.. కాదా అని నిర్ధరించడం కోసం నమూనాలు సేకరించారు. దుండగుడి దుస్తులను, సైఫ్‌ రక్తనమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button