
Salman: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపు.. ఈసారి ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు వరుస బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయనకు మరో బెదింపు వచ్చింది. ఈసారి సల్మాన్‌ను బెదిరించింది నోయిడాకు చెందిన 20 ఏళ్ల యువకుడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీకి కూడా ఇదే యువకుడి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. అయితే డబ్బు కోసమే బెదించారంటూ పోలీసులు చెబుతున్నారు.
ఇంకా స్పందించని సల్మాన్!
కృష్ణజింకలు వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎప్పటి నుంచో బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల అక్టోబర్ 18న సల్మాన్‌ను చంపేస్తాం.. చంపకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ముంబై ట్రాఫిక్ పోలీసులకు బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వాట్సప్‌లో మెసేజ్ చేశారు. ముంబై పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ కంటే దారుణంగా సల్మాన్‌ను చంపేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ముంబై ట్రాఫిక్ పోలీసులు జార్ఖండ్ జంషెడ్ పూర్ కు చెందిన కూరగాయాల వ్యాపారిని అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో వైరం కారణంగా సల్మాన్ ప్రాణాలకు నిరంతరం బెదిరింపులు వస్తున్నప్పటికీ సల్మాన్ ఇంకా స్పందించలేదు.