Jyothika : ‘కంగువా’ నెగిటివ్ రివ్యూస్‌పై జ్యోతిక స్ట్రాంగ్ వార్నింగ్!
శివ దర్శకత్వంలో తమిళ్ స్టార్ సూర్య హీరోగా నటించిన చిత్రం ‘కంగువా’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే కొందరు రివ్యూ రైటర్స్ మాత్రం అయితే ఈ మూవీ అస్సలు బాగా లేదంటూ పోస్ట్ చేశారు. ఈ మూవీకి వచ్చిన నెగెటివ్ రివ్యూస్‌పై సూర్య సతీమణి జ్యోతిక స్పందించారు. అంతేకాదు, ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని సైతం తెలియజేశారు. సూర్య భార్యగా కాకుండా ఒక మూవీ లవర్‌గా తాను ఈ రివ్యూ ఇస్తున్నట్లు తెలిపారు.
పాజిటివ్స్ మర్చిపోయారా?
‘కంగువా.. అద్భుత చిత్రం. సూర్య నటన విషయంలో ఎంతో గర్వంగా ఉన్నాను. నిజమే మొదటి అరగంట అనుకున్న స్థాయిలో లేదు. అలాగే సౌండ్ చాలా ఎక్కువగా ఉంది. ఎన్నో చిత్రాల్లో లోపాలు ఉంటాయి. ఇలాంటి ప్రయోగత్మక చిత్రాల్లో అలాంటి చిన్న లోపాలు ఉండటంలో తప్పులేదు. మూడు గంటల సినిమాలో కేవలం తొలి అరగంట మాత్రమే కదా సరిగా లేనిది. నిజం చెబుతున్నా.. ఇదొక అద్భుత సినిమాటిక్ అనుభూతిని అందించింది. ఆయన చిత్రాల్లో ఇలాంటి కెమెరా వర్క్‌ను మునుపెన్నడూ చూడలేదు. ఈ చిత్రానికి వస్తోన్న నెగెటివ్ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయా. గతంలో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాల్లో మహిళలను తక్కువ చేసేలా డైలాగ్స్ ఉన్నా, సన్నివేశాలు బాగోకపోయినా ఇలాంటి రివ్యూలు చూడలేదు. భారీ యాక్షన్ సన్నివేశాలు, సెకండాఫ్‌లో మహిళలపై చిత్రీకరించిన ఫైట్ సీన్స్, కంగువాపై చిన్నారి ప్రేమ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నాకు తెలిసి రివ్యూ చేసే సమయంలో పాజిటివ్స్ మరిచిపోయినట్లు ఉన్నారు. విడుదలైన తొలి రోజు నుంచే ఇంత నెగెటివిటీని చూడటం బాధగా ఉంది.’ అని అన్నారు.