తెలుగు
te తెలుగు en English
సినిమా

Keerthi Suresh: ఇంటర్‌లోనే ప్రేమలో పడ్డాను.. ఆంటోనీతో లవ్ స్టోరీపై కీర్తి సురేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన ప్రియుడు ఆంటోనీతో కీర్తి ఏడడుగులు నడిచారు. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం వైభవంగా జరిగింది. మరోవైపు పెళ్లైన మరుసటి రోజు నుంచే కీర్తి ‘బేబీ జాన్’ ప్రీ రిలీజ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్.. ఆంటోనీతో తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అప్పుడే ప్రేమలో పడిపోయా!

‘12వ తరగతి చదువుతున్నప్పుడే ఆంటోనీ నాకు ప్రపోజ్ చేశాడు. అప్పుడే నేను ప్రేమలో పడిపోయాను. 15 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. 2010లో ఆంటోనీ నాకు మొదటిసారి ప్రపోజ్‌ చేశాడు. 2016 నుంచి మా బంధం మరింత బలపడింది. నాకు ప్రామిస్‌ రింగ్‌ను బహుమతిగా ఇచ్చాడు. మేము పెళ్లి చేసుకునేవరకు దాన్ని నేను తీయలేదు. నా సినిమాల్లో కూడా మీరు ఆ రింగ్‌ను గమనించొచ్చు. నేను ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్లు నా సన్నిహితులకు, ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే తెలుసు. సమంత, విజయ్‌, అట్లీ, ప్రియా, ప్రియదర్శన్‌, ఐశ్వర్యలక్ష్మి.. ఇలా కొద్దిమందికి మాత్రమే మా ప్రేమ విషయం తెలుసు. 2022 నుంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆంటోనీ నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం. నేను పెళ్లి అయిన దగ్గరినుంచి పసుపుతాడుతోనే సినిమా ప్రచారాల్లో పాల్గొంటున్నా. ఇది చాలా పవిత్రమైనది, శక్తిమంతమైనది. మంచి ముహూర్తం చూసి మంగళసూత్రాలను బంగారు గొలుసులోకి మార్చుకుంటా.’ అని అన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button