Kichcha Sudeep: ‘బిగ్‌బాస్’ షోకి గుడ్ బై చెప్పిన స్టార్ హీరో!

బుల్లితెర ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ షో ఎంత ఫేమస్. ఈ షోకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్.. దీనికి వచ్చే టీఆర్పీ రేటింగ్స్ అంతా ఇంతా కాదు. చాలా మంది చిన్న చిన్న సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొని ఫేమస్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే కన్నడలో గత 11 సీజన్ల నుంచి.. అంటే అక్కడ ఈ షో ప్రారంభమైన నాటి నుంచి హోస్ట్ చేస్తున్న స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘బిగ్‌బాస్’ షోకి సుదీప్ గుడ్ బై చెప్పేశారు.
ఇది మరుపురాని ప్రయాణం!
ఈ మేరకు ‘ఎక్స్’ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘గత 11 సీజన్ల నుంచి నేను ఇష్టంతో పాటు ఎంజాయ్ చేసిన కార్యక్రమం బిగ్‌బాస్. ఈ షోకి హోస్ట్‌గా చేసిన నాపై మీరు చూపించిన ప్రేమకి ధన్యవాదాలు. త్వరలో జరుగనున్న ఫినాలేతో బిగ్ బాస్‌తో నా ప్రయాణం ముగుస్తుంది. వ్యాఖ్యతగా నా శక్తి మేరకు మీ అందరినీ ఎంటర్‌టైన్ చేశానని ఆశిస్తున్నాను. ఇది మరపురాని ప్రయాణం, నాకు సాధ్యమైనంతవరకూ ఉన్నతంగా దీనిని కొనసాగించా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కలర్స్ కన్నడ టీవీ వారికి ధన్యవాదాలు. ప్రేమతో మీ కే’ అంటూ ట్వీట్ చేశారు.