తెలుగు
te తెలుగు en English
సినిమా

OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘లక్కీ భాస్కర్’.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!

ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘లక్కీ భాస్కర్’. దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31 ఈ మూవీ విడుదలై ఘన విజయం సాధించింది. ఆర్థిక నేరాల ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి గుడ్ న్యూస్ అందింది.

రూ. 100 కోట్ల క్లబ్‌లోకి!

ఈ సినిమా నవంబర్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్‌ మార్కెట్, భారతీయ మధ్యతరగతి మనస్థత్వాలు.. వీటన్నిటినీ మేళవిస్తూ దర్శకుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచారు. భాస్కర్‌ కుమార్‌ పాత్రలో దుల్కర్‌ నటన, నేపథ్య సంగీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగులో దుల్కర్‌కు ఇది హ్యాట్రిక్‌. ‘మహానటి’, ‘సీతారామం’ తర్వాత ఇప్పుడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఆయన కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమా ‘లక్కీ భాస్కర్‌’ కావడం విశేషం.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button