తెలుగు
te తెలుగు en English
Linkin Bioసినిమా

Prakash Raj: ప్రకాశ్ రాజ్ టాలీవుడ్ కెరీర్ ఇక ప్రశ్నార్థకమేనా?

తిరుమల లడ్డూ వివాదం అటు తిరిగి.. ఇటు తిరిగి సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌‌నే ఇబ్బంది పెట్టేలా ఉంది. లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రకాశ్ రాజ్.. అనవసరంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పెట్టుకున్నారని, దీంతో ఆయన టాలీవుడ్ సినీ కెరీర్‌ను తనకు తానే ప్రశ్నార్థకంగా చేసుకున్నారని పలువురు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రకాష్ రాజ్‌కు కొండంత అండ మెగా కాంపౌండ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌కు అన్ని విధాలుగా సహకారం అందించింది మెగా కాంపౌండ్. స్వయంగా నాగబాబు రంగంలోకి దిగి అన్నీ చూసుకున్నారు. ఒక దశలో పవన్ కల్యాణ్ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు.

ఒక్కొక్కరికి దూరమవుతున్న ప్రకాశ్ రాజ్!

కానీ, ఇప్పుడు అదే పవన్ కల్యాణ్‌తో ప్రకాశ్ రాజ్ మాటల యుద్ధానికి తెరదీశారు. అయితే, ప్రకాశ్ రాజ్‌కు పవన్‌పై కోపం లేదు. పవన్, బీజేపీకి దగ్గరగా ఉన్నారనేది ఆయన కోపం. ఇదే విషయంపై గతంలో కూడా పవన్‌ను నిలదీసిన ప్రకాశ్ రాజ్, ఇప్పుడు తిరుపతి లడ్డూ విషయంలో పవన్‌ను నేరుగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. బీజేపీ భావజాలాన్ని పూసుకోవద్దని సూచిస్తున్నారు. ఇది పవన్‌తో పాటు, మెగా కాంపౌండ్‌కు కూడా నచ్చడం లేదు. మరోవైపు ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన దుందుడుకు తనంతో టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్లతో సహా అనేక మందితో దూరమయ్యారు. ‘మా’ ఎన్నికల్లో పరోక్షంగా మంచు ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీ కూడా దూరమయ్యారు. ఇలా తన దశాబ్దాల కెరీర్‌లో ఒక్కొక్కర్ని, ఒక్కో వర్గాన్ని ఆయన దూరం చేసుకుంటూనే ఉన్నారు. తాజా పరిణామాలతో ఆయన మెగా కాంపౌండ్‌కు కూడా దూరమైనట్టు కనిపిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే, కొన్నేళ్లకు టాలీవుడ్‌లో ప్రకాశ్ రాజ్ కెరీర్ ప్రశ్నార్థకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button