తెలుగు
te తెలుగు en English
సినిమా

Pushpa-2: బాలీవుడ్‌లో రికార్డుల మోత మోగిస్తున్న ‘పుష్ప-2’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 సినిమా రికార్డులు తిరగరాస్తోంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే అత్యంత వేగంగా రూ. 1000 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా తాజాగా మరో రికార్డును కూడా నమోదు చేసింది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.507.50 కోట్ల (కేవలం హిందీ మార్కెట్‌) నెట్‌ కలెక్షన్స్‌ వసూలు చేసింది. హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేసింది.

3డి వెర్షన్‌లో కూడా..

కాగా.. 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్‌’కు కొనసాగింపుగా ‘పుష్ప 2: ది రూల్‌’ రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై దీనిని నిర్మించారు. ఫహాద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్‌, శ్రీవల్లిగా రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న ఈ సినిమా విడుదలైంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. మరోవైపు, ‘పుష్ప 2’ 3డి వెర్షన్ కూా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో 3డి వెర్షన్‌లో సినిమా చూడొచ్చని టీమ్‌ తెలిపింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button