తెలుగు
te తెలుగు en English
సినిమా

Salaar: సలార్-1 నిరాశ పర్చింది.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ‘సలార్ పార్ట్ – 1 సీజ్ ఫైర్’ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీపై ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఫలితం విషయంలో అంత సంతోషంగా లేనని అన్నారు. ‘సలార్‌-1’ ఫలితంలో నేను సంతోషంగా లేను. ఫస్ట్‌ పార్ట్‌ కోసం నేను పడిన కష్టంతో పోలిస్తే, కాస్త నిరాశగానే అనిపించింది. ఎక్కడో ‘కేజీయఫ్ 2’ ఛాయలు కనిపించాయి. ఇక ఎప్పుడూ అలా జరగదు. ‘సలార్ 2’ మాత్రం నా కెరీర్‌లో బెస్ట్ మూవీగా తీస్తా. ప్రేక్షకుల అంచనాలను మించేలా తీర్చిదిద్దుతా. ఎవరూ ప్రశ్నించే వీలు లేకుండా ‘సలార్ 2’ నా బెస్ట్‌ మూవీల్లో ఒకటిగా ఉంటుంది’ అని అన్నారు.

బాక్సాఫీస్ షేక్!

కాగా.. సలార్ పార్ట్-1 మూవీ విడుదలై ఏడాది పూర్తయింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాదు, రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. అంతేకాదు, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ సినిమా 300 రోజులు కంటిన్యూగా ట్రెండింగ్ లో కొనసాగి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఓవరాల్ పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఛరిష్మా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button