తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Aa Okkati Adakku Teaser: ‘ఆ ఒక్కటి అడక్కు’ టీజర్ రిలీజ్

టాలీవుడ్ కమెడియన్ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహిస్తుండగా.. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా, మేకర్స్ ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా, ఈ సినిమాను మార్చి 22వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.

ALSO READ: ఇష్టమైన వారి కోసం ఎంత కష్టమైన ఇష్టంగా అనిపిస్తుంది: లంబసింగి ట్రైలర్

జన్మంతా బ్రహ్మాచారిగానే..

టీజర్‌లో పెళ్లి కోసం ఆరాటపడే యువకుడిగా అల్లరి నరేశ్ నటించారు. అతడికి 25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలని, లేకపోతే జన్మంతా బ్రహ్మాచారిగానే ఉండిపోతాడని జ్యోతిష్యుడు చెప్పడంతో టీజర్ మొదలవుతోంది. ఆ తర్వాత పెళ్లెప్పుడు అని గణ (అల్లరి నరేశ్)ను అందరూ అడుగుతుంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో గణకు పరిచయం ఏర్పడుతుంది. పెళ్లి చేసుకుంటానని గణ అడిగితే.. ‘ఆ ఒక్కటి అడక్కు’ అని ఫారియా చెప్పడంతో గణ అవాక్కవుతాడు. మొత్తంగా 66 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ సరదాగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button