తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Akhil Wedding: అక్కినేని ఇంట్లో మరోసారి పెళ్లి సందడి.. అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్?

అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి మొదలు కాబోతోంది. ఇటీవలే నాగచైతన్య – శోభితల వివాహం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా అక్కినేని అఖిల్ – జైనబ్‌ల పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 24న వీరి పెళ్లి ఫిక్స్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నాగచైతన్య – శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ సయమంలోనే అఖిల్ – జైనబ్‌ల ఎంగేజ్మెంట్ కూడా జరిగిన విషయం తెలిసిందే.

వెరీ వెరీ గ్రాండ్‌గా..!

కాగా.. చైతూ-శోభితల వివాహం అతికొద్ది మంది అతిథుల మధ్యలో జరిగిన విషయం తెలిసిందే. అయితే, అఖిల్ – జైనబ్‌ల వివాహం మాత్రం గ్రాండ్ చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నారట. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్స్‌ను కూడా వీరి వివాహానికి ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. అఖిల్ పెళ్లి డేట్ గురించి అక్కినేని ఫ్యామిలీ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button