తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Allu Arjun: షారుఖ్ ఖాన్ తర్వాత ఆ రికార్డు సాధించిన ఒకే ఒక్క‌డు అల్లు అర్జున్!

ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్లో తనకంటూ ప్రత్యేకంగా ఓ ఆర్మీని క్రియేట్ చేసుకుంటున్నాడు. టాలీవుడ్‌లో ఏ హీరోకూ సాధ్యంకాని ఫ్యాన్ బేస్‌ని బన్నీ నార్త్ ఇండియాలో సొంతం చేసుకున్నారు. నిన్న బిహార్‌లోని పాట్నా వేదికగా జరిగిన ‘పుష్ప – 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూస్తే అల్లు అర్జున్‌కి నార్త్ ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించి ఉత్త‌రాదిలో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్.

కొత్త సూపర్ స్టార్

పుష్ప – 2 ట్రైల‌ర్ వేడుక‌ను బిహార్ రాజ‌ధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ వేడుక‌తో అల్లు అర్జున్ అరుదైన రికార్డును నమోదు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఉత్తరాదిలో ఏ న‌టుడికి రాని విధంగా.. ఒక హీరో సినిమా వేడుక‌కు 2 ల‌క్ష‌ల మందికి పైగా హాజ‌రు అయిన‌ట్లు తెలుస్తుంది. ఇంత‌కుముందు ఈ రికార్డు షారుఖ్ ఖాన్ పేరిట న‌మోదు అయ్యింది. 2011లో షారుఖ్ న‌టించిన డాన్ 2 సినిమాకి పాట్నాలో ఇదే రేంజ్‌లో అభిమానులు రాగా.. ఇప్పుడు మళ్లీ అదే రేంజ్‌లో క‌నిపించ‌డంతో ఇండియాకి కొత్త సూప‌ర్ స్టార్ వ‌చ్చారని.. షారుఖ్ త‌ర్వాత ఆ రేంజ్ ఉన్న హీరో అల్లు అర్జున్ మాత్ర‌మేన‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌రోవైపు ముంబైలో పుష్ప-2 ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా షారుఖ్ ఖాన్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రు కాబోతున్న‌ట్లు స‌మాచారం.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button