తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Allu Arjun: డ్రగ్స్ రహిత సమాజం కోసం.. మద్దతుగా అల్లు అర్జున్ స్పెషల్ వీడియో!

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలకు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న బాధితులకు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్‌కు సహకరిస్తూ తన వంతు బాధ్యతగా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా అల్లు అర్జున్‌ ప్రత్యేక వీడియో షేర్‌ చేశారు.

మంచి సమాజం కోసం..

‘మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్‌ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో టోల్‌ ఫ్రీ నంబర్‌ 1908కు ఫోన్‌ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చే వరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. గతంలో చిరంజీవి, ఎన్టీఆర్‌ కూడా ఈ విధమైన అవగాహన వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైెరెక్టర్ సుకుమార్ కలయికలో రూపొందిన ‘పుష్ప-2’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్లతో దేశమంతా చుట్టేస్తోంది. ఇక, ప్రస్తుతం
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘పుష్ప-2’ మేనియానే కనిపిస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button