Allu Arjun: తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు భారీ ఊరట
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో హీరో అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్న ఆయనకు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. రూ.50 వేలు, రెండు పూచీకత్తులను సమర్పించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు అల్లు అర్జున్‌కు పలు షరతులు విధించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించింది. ఇక, బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్!
కాగా.. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ రాగా.. అక్కడ జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక, ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీనిపై కోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుపై నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. ఇక, బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.