తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Allu Arjun: అల్లు అర్జున్ నిజంగానే తప్పుడు దారిలో వెళ్తున్నాడా?

మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ ఇప్పట్లో ముగిసేలా లేదు. పైగా అది పీక్స్‌కి చేరే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్‌లో ‘పుష్ప-2’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగున్న నేపథ్యంలో మెగా బ్రదర్ నాగాబాబు ‘ఎక్స్’లో చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావని తెలుసుకుంటే, వెంటనే నీ దారిని మరల్చుకో.. ఆలస్యం చేస్తే, వెనక్కి తిరిగి రావడానికి చాలా కష్టం అవుతుంది..’ అంటూ స్వామి వివేకానంద కొటేషన్‌ని నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ను నాగబాబు.. బన్నీని ఉద్దేశించే చేశారని, నేరుగా చెప్పకపోయినా అల్లు అర్జున్ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని, మెగా ఫ్యామిలీతో కలిసి పోవాలని నాగబాబు పరోక్షంగా ఈ ట్వీట్ చేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

అల్లు అర్జున్ కౌంటరిస్తారా?

ఇక, ఈ ట్వీట్‌పై బన్నీ ఫ్యాన్స్ ఎప్పటిలాగే రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా మెగా బ్రదర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అల్లు అర్జున్ సొంతంగా, తనకు తానుగా ఎదగడాన్ని మెగా ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే దేశమంతా ‘పుష్ప-2’ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించినా మెగా ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కరంటే ఒక్కరు ఒక చిన్న ట్వీట్ కూడా చేయలేదని మండిపడుతున్నారు. అంతేకాదు, ‘పుష్ప 2’ సినిమాను ఏపీలో మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా ఈ‌సారి ‘పుష్పగాడి’ వైల్డ్ ఫైర్ ఏంటో చూపిస్తామంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. మరోవైపు.. బాలయ్యతో అన్‌స్టాపబుల్ షోలో మాట్లాడినట్టు.. ఇటీవల ఏ చిన్న అవకాశం దొరికినా పరోక్షంగా మెగా ఫ్యామిలీపై సెటైర్లు వేస్తున్న అల్లు అర్జున్ ఇవాళ కూడా హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగా ఫ్యామిలీపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కీలక వ్యాఖ్యలు చేసే అవకాశముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇవాళ జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ మరింత ఆసక్తిగా మారింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button