తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Allu Arjun: అల్లు అర్జున్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన రష్మిక.. ఏంటో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రష్ రష్మిక మందాన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘పుష్ప – 2 (ది రూల్). సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా రష్మిక తనకు ప్రత్యేక కానుక పంపించినట్లు అల్లు అర్జున్‌ తెలిపారు. ‘వెండిని కానుకగా అందుకుంటే ఆ వ్యక్తికి అదృష్టం వరిస్తుందని మా అమ్మ చెప్పారు. ఈ వెండి వస్తువు, స్వీట్స్‌ తప్పకుండా మీకు మరెంతో లక్‌, పాజిటివిటీ, ప్రేమ అందిస్తాయని నమ్ముతున్నా’ అనే సందేశాన్ని ఆమె పంపించారని అన్నారు.

థాంక్యూ మై డియర్!

ఈ నోట్‌ను షేర్‌ చేస్తూ.. ‘థాంక్యూ మై డియర్‌.. ఇప్పుడు మరెంతో అదృష్టం కావాలి’ అని అల్లు అర్జున్‌ రాసుకొచ్చారు. దీనిపై రష్మిక తిరిగి స్పందిస్తూ.. ‘బాక్సాఫీస్‌ వద్ద ‘పుష్ప’ తప్పకుండా రూల్‌ చేస్తుంది. మన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రేక్షకులు మన శ్రమను గుర్తిస్తారు. ఆ విషయంలో నేను ఎంతో నమ్మకంతో ఉన్నా’ అని పేర్కొన్నారు. కాగా.. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప: ది రైజ్‌ పేరుతో తొలి భాగం 2021లో విడుదలైంది. ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా లభించింది. ఇప్పుడు పుష్ప – 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఓవర్సీస్‌లో ప్రీ బుకింగ్ సేల్స్‌లో దుమ్ము దులుపుతోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button