తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Amaran: ‘అమరన్’ మూవీ నుంచి ఆ సీన్ కట్.. ఎందుకంటే..?

తమిళనాడుకు చెందిన ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన సినిమా ‘అమరన్’. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌కి వచ్చి ఓటీటీలోనూ ఇది అదరగొడుతోంది.

సెల్ ఫోన్ నంబర్ సీన్ తొలగింపు!

ఇక, ఈ సినిమాలోని సెల్ ఫోన్ నంబర్ సన్నివేశం వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోకు సాయి పల్లవి తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఇందుకోసం చిత్ర యూనిట్‌ ఓ నెంబర్‌ను ఉపయోగించింది. అయితే సినిమా చూసిన అభిమానులు ఆ ఫోన్‌ నెంబర్‌కు తెగ ఫోన్‌లు చేయడం మొదలు పెట్టారు. అది విఘ్నేషన్ అనే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఫోన్ నంబర్. దీంతో ఆ విద్యార్థి తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. సినిమా విడుదలైనప్పటి నుంచి నిత్యం కాల్స్ రావడంతో మానసికంగా కుంగిపోయాడు. దాంతో అమరన్ చిత్ర బృందం రూ. 10 లక్షలు పరిహారం ఇవ్వాలని నోటీసులు పంపాడు. ఈ నేపధ్యంలో కొద్దిరోజుల క్రితం ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో ఆ సెల్‌ఫోన్ నంబర్‌తో కూడిన సన్నివేశాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూవీలో ఆ సీన్ కనిపించడం లేదు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button