
Anand Devarakonda: 90’s ‘ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’కి సీక్వెల్.. హీరో, హీరోయిన్లు ఎవరంటే..?
గతేడాది ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా రిలీజైన 90’s ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. 1990ల్లో మధ్య తరగతి జీవితాలు, అప్పటి పరిస్థితులను దర్శకుడు ఆదిత్య హాసన్ కళ్లకు కట్టినట్టు చూపించండంతో ఈ వెబ్ సిరీస్‌కి చాలా మందికి కనెక్ట్ అయ్యింది. శివాజీ కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో వాసంతిక, రోహన్, స్నేహల్ కామత్ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే, ఈ వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ప్రొడక్షన్ నంబర్ 32!
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రానుండగా.. సితార ఎంటర్‌టైనమెంట్స్, ఫోర్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను ప్రొడక్షన్ నంబర్ 32 పేరుతో సంక్రాంతి కానుకగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో శివాజీ చిన్న కొడుకు పాత్రలో ఆనంద్ దేవరకొండ కనిపించబోతున్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది.