Anushka Shetty: అనుష్క బర్త్ డే స్పెషల్.. అంచనాలు పెంచేస్తున్న ‘ఘాటి’ పోస్టర్!
‘బాహుబలి’ తర్వాత అనుష్క శెట్టి కెరీర్ చాలా స్లో అయ్యింది. గతేడాది సెప్టెంబర్‌లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో ఆడియన్స్‌కి దగ్గరైనా ఆ మూవీ ఆశించన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. బహుశా అందుకేనేమో కథల ఎంపిక విషయంలో స్వీటీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత ఏడాది కాలంగా అనుష్క నుంచి ఒక్క మూవీ అప్డేట్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే ఇవాళ అనుష్క శెట్టి బర్త్ డే సందర్భంగా ఆమె అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందింది. ఆమె నటిస్తున్న కొత్త మూవీ డీటైల్స్ బయటకొచ్చాయి. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
‘ఘాటి’ పోస్టర్ రిలీజ్!
‘హరిహర వీరమల్లు’ లేట్ అవుతూ వచ్చేసరికి ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసిన డైరెక్టర్ క్రిష్.. అనుష్కని లీడ్ రోల్‌గా పెట్టి సినిమా తీస్తున్నారు. దీనికే ఇప్పుడు ‘ఘాటీ’ టైటిల్ నిర్ణయించారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బాధితురాలే క్రిమినల్ అయితే? అనే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తల, చేతికి రక్తంతో చుట్ట తాగుతూ.. భయపెట్టేలా అనుష్క ఫస్ట్ లుక్ ఉంది. సాయంత్రం 4:05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. పాన్ ఇండియా మూవీగా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.