Balakrishna: ‘ఆదిత్య 369’ సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన బాలయ్య.. హీరోగా మోక్షజ్ఞ!
బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ఆదిత్య 369’. 1991లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌లో ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలకృష్ణ, మోహిని కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ సైతం అనేక సందర్భాల్లో ఆదిత్య 369కి సీక్వెల్ తీయాలని ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఆదిత్య 369కి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ ఉంటుందని బాలకృష్ణ స్పష్టంచేశారు.
డిసెంబర్ 6న పూర్తి వివరాలు!
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ప్రముఖ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో ఆదిత్య 369 సినిమా గెటప్‌లో బాలయ్య స్టేజ్‌పై సందడి చేశారు. సీక్వెల్ విశేషాలు కూడా పంచుకున్నారు. ‘ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్‌గా ఆదిత్య 999 రానుంది. మా అబ్బాయి మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఆదిత్య 999 పట్టాలెక్కుతుంది’ అని తెలిపారు. ఇక, ఈ షో ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న ప్రసారం కానుంది. అప్పుడు మరిన్ని విషయాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా.. ఈ ప్రకటనతో నందమూరి ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.